- Telugu News Photo Gallery Political photos Go dress up well female mp removed from tanzania parliament for wearing tight pants
మహిళా ఎంపీకి పార్లమెంట్‌లో చేదు అనుభవం.. ప్యాంట్ ధరించి వచ్చినందుకు సభకు అనుమతించని స్పీకర్
టాంజనీయాలో ఓ ఎంపీకి చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళా ఎంపీ ప్యాంట్ ధరించి పార్లమెంట్‌కు రావడంతో పార్లమెంట్ నుంచి బయటకు పంపించారు. కండెస్టర్ సిచ్వాలే అనే మహిళా ఎంపీ ..
Updated on: Jun 03, 2021 | 2:07 PM

టాంజనీయాలో ఓ ఎంపీకి చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళా ఎంపీ ప్యాంట్ ధరించి పార్లమెంట్‌కు రావడంతో పార్లమెంట్ నుంచి బయటకు పంపించారు. కండెస్టర్ సిచ్వాలే అనే మహిళా ఎంపీ ప్యాంట్ ధరించి సభకు రావడంతో సభ్యులందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె సభకు క్షమాపణలు చెప్పాలని సభ్యులు డిమాండ్ చేశారు. మహిళ ఎంపీ ప్యాంట్ ధరించి పార్లమెంట్‌కు రావడం వల్ల సభను విడిచి వెళ్లాలని సూచించినట్లు స్పీకర్ తెలిపారు. సాంప్రదాయ బద్దంగా దుస్తులు ధరించి సభకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

అయితే ఆ దేశంలో మహిళలు జీన్స్ ధరించి సభకు రావడం అనేది నిషేధించారు. అయితే ఇలాంటి దుస్తులు ధరిచి పార్లమెంట్‌కు రావడం ఇదేమి మొదటి సారి కాదని, ఎన్ని సార్లు చెప్పినా ఈ సాంప్రదాయ దుస్తులతో కాకుండా జీన్స్ ధరిస్తూ సభలకు వస్తున్నారని కూడా ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నుంచి ఇలాంటి దుస్తులు ధరిస్తూ ఎవరైన మహిళలు వస్తే సభలోకి ప్రవేశం ఉండదని పార్లమెంట్ ఛాంబర్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మహిళా ఎంపీ నలుపు రంగు ప్యాంటు, పసుపు రంగు టాప్ ధరించి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. దీంతో ఆమె ధరించిన దుస్తులపై వివాదం తలెత్తింది. బిగుసుగా ఉన్న దుస్తులు ధరించినందుకు ఆమె క్షమాపణలు చెప్పాలంటూ సభలో ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ మా సోదరీమణులు కొందరు వింత వింతగా దుస్తులు ధరిస్తున్నారు. సభ్యసమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. దేశంలో ఉన్నతమైన పార్లమెంట్ సభ, సాంప్రదాయాలను అందరూ గౌరవించాలి. లేదంటే అటువంటి వాళ్లపై కఠిన చర్యలు ఉంటాయి అని హెచ్చరించారు. ఇక స్పీకర్ వ్యవహారశైలి పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి మహిళల వస్త్రధారణ గురించి ఇలా మాట్లాడటం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు.
