Covid Vaccine: గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కోవిడ్ వాక్సిన్ … జిల్లా కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు..

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి మరో 5 లక్షల కోవీషిల్డ్ & కోవిక్సిన్ వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి...

Covid Vaccine: గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కోవిడ్ వాక్సిన్ ... జిల్లా కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు..
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 03, 2021 | 9:48 AM

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి మరో 5 లక్షల కోవీషిల్డ్ & కోవిక్సిన్ వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కోవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి.  అక్కడి నుంచి వ్యాక్సిన్‌ను రోడ్డు మార్గంలో తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. టీకా నిల్వ కేంద్రం నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్‌ను తరలించనున్నారు.

మొత్తం 30 బాక్సుల్లో 3,60,000 (మూడు లక్షల అరవై వేల) కోవీషీల్డ్ వ్యాక్సిన్లు పూణే సీరం ఇనిస్టిట్యూట్ ఢిల్లీ ఎయిర్ ఇండియా 467 విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఇక 19 బాక్సుల్లో సుమారుగా 97,280 వేల డోసులు భారత్ బైయోటెక్ నుంచి వ్యాక్సిన్లు చేరుకున్నాయి. విమానశ్రయం నుంచి గన్నవరం రాష్ట్ర టీకా నిల్వ కేంద్రంకి తరలించారు.

13 జిల్లాల తరలించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తోంది. అన్ని జిల్లాల్లోకి వ్యాక్సిన్ అందించేలా ప్లాన్ చేస్తోంది రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ. ఇందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : PM Modi: కేబినెట్ సమావేశాల్లో ‘జీరో అవర్’.. ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త సలహా.. ఎందుకో తెలుసా?