Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: కేబినెట్ సమావేశాల్లో ‘జీరో అవర్’.. ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త సలహా.. ఎందుకో తెలుసా?

ప్రభుత్వానికి సంబంధించిన నెగటివ్ అంశాలను తెలుసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అసోం సీఎం హిమంత బిశ్వాకు ఓ సరికొత్త సలహా ఇచ్చారు. కేబినెట్ సమావేశాల్లో ‘జీరో అవర్’ తరహా విధానాన్ని అమలు చేయాలని ఆయన బిశ్వాకు సూచించారు.

PM Modi: కేబినెట్ సమావేశాల్లో ‘జీరో అవర్’.. ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త సలహా.. ఎందుకో తెలుసా?
PM Narendra Modi
Follow us
Janardhan Veluru

|

Updated on: Jun 03, 2021 | 8:31 AM

ప్రభుత్వానికి సంబంధించిన నెగటివ్ అంశాలను తెలుసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అసోం సీఎం హిమంత బిశ్వాకు ఓ సరికొత్త సలహా ఇచ్చారు. కేబినెట్ సమావేశాల్లో ‘జీరో అవర్’ తరహా విధానాన్ని అమలు చేయాలని ఆయన బిశ్వాకు సూచించారు. ఇటీవల అసోం ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన హిమంత బిశ్వా తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీతో బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేబినెట్ సమావేశాల్లో జీరో అవర్ తరహా విధానాన్ని అమలు చేయాలని ప్రధాని సూచించినట్లు బిశ్వా వెల్లడించారు. ఈ జీరో అవర్‌ను ప్రభుత్వానికి సంబంధించిన నెగటివ్ అంశాలపై చర్చకు మాత్రమే పరిమితం చేయాలని సూచించారు. తద్వారా ప్రభుత్వానికి సంబంధించిన నెగటివ్ అంశాలు, దాని పరిష్కారానికి సంబంధించిన సలహాలను మంత్రివర్గ సహచరుల నుంచి తీసుకునేందుకు వీలుంటుందని ప్రధాని సలహా ఇచ్చినట్లు తెలిపారు.

ప్రధాని సలహాను పాటించనున్నట్లు తెలిపారు అసోం సీఎం బిశ్వా. ప్రభుత్వానికి సంబంధించిన నెగటివ్ అంశాలను ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజల నుంచి సేకరించి…దాన్ని సీనియర్ మంత్రులకు తెలియజేయాలని సూచించారు. దీనిపై సీనియర్ మంత్రులతో తాను కేబినెట్ సమావేశంలో చర్చించి తక్షణ పరిష్కారాన్ని కనుగొంటామని  పేర్కొన్నారు. ప్రధాని మోదీ తాను గుజరాత్ సీఎంగా పనిచేసిన రోజుల్లో ఇదే విధానాన్ని అమలు చేశారని…ఈ విధానాన్ని తాను అసోంలో అమలుచేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించి సద్విమర్శలను తప్పనిసరిగా స్వీకరించి…వాటిని సరిదిద్దుకుంటామన్నారు.

Himanta Biswa Sarma

Assam CM Himanta Biswa Sarma

మమతా బెనర్జీ తీరు సరికాదు యాస్ తుపాను నష్టంపై సమీక్షించేందుకు ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన సమావేశంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యవహార తీరు సరిగ్గా లేదన్నారు. ప్రధాన మంత్రి వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత మమతకు ఉందని..ప్రధాని మోదీతో కలిసి సమీక్షా సమావేశంలో 30 నిమిషాలు పాల్గొనేందుకు ఆమెకు సమయం లేదా? అని ప్రశ్నించారు. ఈ తరహా వాదనను తన రాజకీయ జీవితంలో తాను మునుపెన్నడూ చూడలేదన్నారు. సోనియాగాంధీ రాకకోసం వెయిటింగ్ రూంలో  పలువురు ముఖ్యమంత్రులు రెండు మూడు గంటలు ఎదురుచూసిన సందర్భాలున్నాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఎన్నికల సభ కోసం బెంగాల్‌కు వెళ్లలేదని…ఆ రాష్ట్ర ప్రజల సమస్యను పరిష్కరించేందుకు వెళ్లారని గుర్తుచేశారు. కేంద్రం-రాష్ట్రాల మధ్య సంబంధాలపై స్పందిస్తూ మమతా బెనర్జీలాంటి వ్యక్తుల ఈగో వ్యవహార శైలి కారణంగా ఇద్దరి మధ్య సత్సంబంధాలకు విఘాతం కలుగుతోందని విమర్శించారు.

ఇవి కూడా చదవండి..

ఈట‌ల రాజేంద‌ర్‌ టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేది అప్పుడేనా…? మీడియా స‌మావేశంలో అన్ని విష‌యాలు..

ఢిల్లీలో మళ్లీ తెరపైకి వచ్చిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి వ్యవహారం.. రెండు, మూడు రోజుల్లో క్లారిటీ..!