AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump: సొంత సోషల్ మీడియా సైట్‌..నెల రోజుల్లోనే మనసు మార్చుకున్న ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నెల రోజుల వ్యవధిలోనే సొంత సోషల్ మీడియా సైట్‌పై మనసు మార్చుకున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు తన ఖాతాను బ్యాన్ చేయడంతో నెల రోజుల క్రితం ట్రంప్ తన సొంత సోషల్ మీడియా సైట్‌ను ప్రారంభించారు.

Donald Trump: సొంత సోషల్ మీడియా సైట్‌..నెల రోజుల్లోనే మనసు మార్చుకున్న ట్రంప్
Donald Turmp
Janardhan Veluru
|

Updated on: Jun 03, 2021 | 10:06 AM

Share

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నెల రోజుల వ్యవధిలోనే ఓ కీలక అంశం విషయంలో మనసు మార్చుకున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు తన ఖాతాను బ్యాన్ చేయడంతో నెల రోజుల క్రితం ట్రంప్ తన సొంత సోషల్ మీడియా సైట్‌ను ప్రారంభించారు. తన మద్ధతుదారులతో కనెక్ట్ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన భావించారు. అయితే నెల రోజుల వ్యవధిలోనే దీన్ని మూసేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్నిట్రంప్ మీడియా వ్యవహారాలు చూస్తున్న జాసన్ మిల్లర్ ధృవీకరించారు. “From the Desk of Donald J. Trump,” ను శాశ్వితంగా మూసేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

విశాలమైన ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాసన్ మిల్లర్ తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని త్వరలోనే మీడియాకు తెలియజేస్తామని చెప్పారు. అయితే ఈ ప్రత్యామ్నాయ ఏర్పాటు ఎప్పటిలోగా సిద్ధమవుతోందో? ఇప్పుడే చెప్పలేనన్నారు. మరో సోషల్ మీడియా వేదికలో డొనాల్డ్ ట్రంప్ చేరబోతున్నారా? అన్న మీడియా ప్రశ్నకు.. అవునని ఆయన సమాధానమిచ్చారు.

అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి తర్వాత అమెరికాలోని క్యాపిటల్ భవనంపై డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడి చేసి..హింసను రాజేయడం తెలిసిందే. వీరిని ప్రోత్సహించేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినందుకు ఆయన ఖాతాలను ట్విట్టర్, ఫేస్‌బుక్‌ శాశ్వితంగా నిషేధించాయి. మే 4న సొంత సోషల్ మీడియా సైట్‌ను ఏర్పాటు చేసుకున్న ట్రంప్…నెల రోజులు గడవక ముందే దాన్ని మూసేయాలని నిర్ణయం తీసుకోవడం అమెరికా మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ఖాతాపై నిషేధాన్ని కొనసాగించాలని మే 5న జరిగిన ఫేస్‌బుక్ ఓవర్‌సైట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. తనపై విధించిన శాశ్విత బ్యాన్ ఎత్తేస్తే తిరిగి ఆయన ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో చేరొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే దీనిపై ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి..

యూజర్లకు గుడ్‌న్యూస్‌.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. ఇక స్టిక్కర్లను గుర్తించడం సులభతరం

బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్న టెర్రరిస్టులు.. జమ్మూకాశ్మీర్‌లో మరొకరి హత్య..