AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్న టెర్రరిస్టులు.. జమ్మూకాశ్మీర్‌లో మరొకరి హత్య..

bjp rakesh pandit: జమ్ముకశ్మీర్‌పై టెర్రరిస్టులు మరోసారి అరాచకానికి తెగబడ్డారు. బీజేపీ నాయకుడిపై కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశారు. పుల్వామా జిల్లాలోని త్రాల్‌లో ఈ దారుణం...

బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్న టెర్రరిస్టులు.. జమ్మూకాశ్మీర్‌లో మరొకరి హత్య..
Sanjay Kasula
|

Updated on: Jun 03, 2021 | 8:44 AM

Share

జమ్ముకశ్మీర్‌పై టెర్రరిస్టులు మరోసారి అరాచకాానికి తెగబడ్డారు. బీజేపీ నాయకుడిపై కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశారు. పుల్వామా జిల్లాలోని త్రాల్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. మున్సిపల్ కౌన్సిలర్, పుల్వామా జిల్లా బీజేపీ సెక్రటరీ రాకేశ్ పండిత హత్యకు గురయ్యారు. బుధవారం ఆయన త్వాల్‌లో పర్యటిస్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అత్యంత సమీపం నుంచి కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అదే సమయంలో అక్కడే ఉన్న మరో మహిళకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుల కోసం గాలించారు.

రాకేశ్ పండిత త్రాల్‌లోని తన స్నేహితుడు ముస్తాఖ్ భట్‌ను కలిసేందుకు వెళ్లారు. ఆయన మిత్రుడి ఇంటి ఆవరణలోనే ఈ ఘటన జరిగింది. ముగ్గురు మిలిటెంట్లు తుపాకులతో కాల్పులు జరిపినట్లుగా ప్రతేక్ష సాక్షులు పోలీసులకు సమాచారం అందించారు.  ఈ ఘటనలో ఆయన మిత్రుడి కూతురికి కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉందని కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ముందుగానే రెక్కి నిర్వహించినట్లుగా తెలుస్తోంది. పక్క ప్లాన్ ప్రకారమే ఈ దాడికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

రాకేశ్ పండిత శ్రీనగర్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య నివసిస్తున్నారు. ఆయనకు ఇద్దరు పబ్లిక్ సెక్యూరిటీ ఆఫీసర్లు సెక్యూరిటీ కల్పిస్తున్నారు. అయితే  త్రాల్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయన భద్రతా సిబ్బందిని తీసుకెళ్లలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన వెంటనే త్రాల్‌ పట్టణ ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసివేశారు. రాకేశ్ పండిత హత్యను బీజేపీతో పాటు ఇతర పార్టీల నేతలు ఖండించారు. ఇది పరికిపంద చర్య అని.. కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆటలు ఇక సాగవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని రోజులుగా కాశ్మీర్‌లోని బీజేపీ నేతలను టెర్రరిస్టులు టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. పక్కా ప్లాన్‌తో వారిని హత్య చేస్తున్నారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది బీజేపీ నేతలు హత్యకు గురయ్యారు.

ఇవి కూడా చదవండి : వెబ్‌సైట్ ద్వారా ఆనంద‌య్య మందు పంపిణీ.. వేగంగా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం యంత్రాంగం

Heavy Rains: కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు.. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..