‘బీర్ తాగండి….కోవిద్ వ్యాక్సిన్ తీసుకొండి…..’ అమెరికన్లను ప్రోత్సహించేందుకు అధ్యక్షుడు జోబైడెన్ సరికొత్త పిలుపు

అమెరికాలో కోవిద్ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు అధ్యక్షుడు జోబైడెన్ సరికొత్త పిలుపునిచ్చారు. 'బీర్ తాగండి..హెయిర్ కట్ చేయించుకొండి..మీ వ్యాక్సిన్ తీసుకొండి' అంటూ వెరైటీ సందేశమిచ్చారు. జులై 4 న అమెరికా నేషనల్ హాలిడేని పాటించనుంది.

'బీర్ తాగండి....కోవిద్ వ్యాక్సిన్ తీసుకొండి.....' అమెరికన్లను ప్రోత్సహించేందుకు అధ్యక్షుడు జోబైడెన్  సరికొత్త పిలుపు
Get Shot Have Beer Biden Call To Encourage Vaccination
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jun 03, 2021 | 11:19 AM

అమెరికాలో కోవిద్ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు అధ్యక్షుడు జోబైడెన్ సరికొత్త పిలుపునిచ్చారు. ‘బీర్ తాగండి..హెయిర్ కట్ చేయించుకొండి..మీ వ్యాక్సిన్ తీసుకొండి’ అంటూ వెరైటీ సందేశమిచ్చారు. జులై 4 న అమెరికా నేషనల్ హాలిడేని పాటించనుంది. (ఆ రోజున అమెరికా ఇండిపెండెన్స్ డే).. అప్పటిలోగా దేశంలో 70 శాతం మందికి పైగా వ్యాక్సినేషన్ చేయించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ సందర్భంగా బైడెన్ ఈ పిలుపునిస్తూ.. కోవిద్ పై పోరులో అమెరికన్లు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. వ్యాక్సిన్ ను ప్రతి వ్యక్తికీ ఇస్తున్నామని, కోవిద్-19 నుంచి..దాని పట్టు నుంచి మనం విముక్తులం కావలసి ఉందని పేర్కొన్నారు. మనకు మనం దీని బారి నుంచి ‘ఇండిపెండెన్స్ ప్రకటించుకుందాం’ అని అన్నారు. కనీసం మిగిలిన ఈ సంవత్సరమైనా దేశంలో మెరుగైన, ఆరోగ్యకరమైన పరిస్థితి నెలకొనేలా చూద్దాం అన్నారాయన. 70 శాతం లక్ష్యాన్ని సాధించగలుగుతామన్న నమ్మకం తనకు ఉందన్నారు. ప్రస్తుతం అమెరికాలో 63 శాతం మంది ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. 12 రాష్ట్రాల్లో డెబ్బై శాతానికి పైగా ప్రజలు టీకామందులు తీసుకోగా మరిన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఇందుకు యత్నిస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో విజేతలైనవారికి 10 లక్షల డాలర్ల ప్రైజ్ మనీని (లాటరీ) గా ఇస్తామని కొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి.

కాగా-గత ఏడాది మార్చి తరువాత అమెరికాలో మొదటిసారిగా రోజువారీ కోవిద్ కేసులు 20 వేలకు తగ్గుతూ వచ్చాయని, మరణాల రేటు కూడా తగ్గిందని బైడెన్ చెప్పారు. దాదాపు ఆరు లక్షల మంది కోవిద్ రోగులు మరణించారన్నారు . ఇక ఎలాంటి రాజకీయ పోకడలకు తావు లేకుండా వివిధ దేశాలకు తాము 80 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఇస్తామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. వ్యాక్సిన్ అవసరమైన అన్ని దేశాలకు మొదటి ప్రయారిటీగా దీన్ని పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. అయితే రష్యా..చైనా వంటి దేశాలు దీన్ని వ్యాక్సిన్ డిప్లొమసీగా అభివర్ణించాయి.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : కలర్ ఫుల్ లెమర్స్ బలే డాన్స్ చేస్తున్నాయ్.యూరప్ లోని చెస్టర్ జూ లో అరుదైన లెమర్స్ : Viral Video

ప్రేయసి కోసం ప్రియుడు గెటప్ చేంజ్..అంతలోనే షాకింగ్ ట్విస్ట్..?వైరల్ గా మారిన వీడియో : Viral Video.

శవం అనుకున్నారు… లేచి కూర్చున్నాడు.బాబోయ్ సేవపేటికలో మృతదేహం ఉన్నట్టుండి లేచింది..!:Viral Video.

పాపం కోతి లెక్క తప్పి బోర్లా పడింది..చెట్టుపై నుండి దూకబోయి బోర్లాపడ్డ కోతిపిల్ల : Monkey Viral Video