Etela Rajender: ఈట‌ల రాజేంద‌ర్‌ టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేది అప్పుడేనా…? మీడియా స‌మావేశంలో అన్ని విష‌యాలు..

Etela Rajender: మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తెరాస‌కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. బీజేపీలో చేరే క్ర‌మంలోనే మే 4 (రేపు) తెరాస పార్టీతోపాటు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది....

Etela Rajender: ఈట‌ల రాజేంద‌ర్‌ టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేది అప్పుడేనా...? మీడియా స‌మావేశంలో అన్ని విష‌యాలు..
Etala Rajender
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 03, 2021 | 7:52 AM

Etela Rajender: మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తెరాస‌కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. బీజేపీలో చేరే క్ర‌మంలోనే జూన్‌ 4 (రేపు) తెరాస పార్టీతోపాటు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈట‌ల ఈ నెల 8 లేదా 9న భాజ‌పాలో చేరేందుకు ఏర్పాట్లు సిద్ధ‌మ‌వుతున్నాయ‌ని వార్తలు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీలో చేరేందుకు ఈట‌ల వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం జేపీ నడ్డాను, మంగళవారం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌ని, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని కలిసిన ఆయన బుధవారం మరోమారు జాతీయ నాయకత్వంతో సమావేశమయ్యారు. ఈ క్ర‌మంలోనే ఏనుగు రవీందర్‌రెడ్డిలు ఛుగ్‌, మాజీ ఎంపీ జి.వివేక్‌వెంకటస్వామితో కలిసి ఆ పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌తో సాయంత్రం భేటీ అయ్యారు. ఇక ఢిల్లీ ప‌ర్య‌ట‌న పూర్తి చేసుకొని ఈట‌ల నేడు (గురువారం) హైద‌రాబాద్‌కు చేరుకుంటారు. అనంత‌రం భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టించేందుకు గురువారం మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే ఈట‌ల‌తో పాటు టీఆర్ఎస్‌కు చెందిన మ‌రో ఐదురుగు నేతులు భాజ‌పాలో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేర‌డాన్ని కొంద‌రు బీజేపీ నేత‌లు అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని జ‌రుగుతోన్న ప్ర‌చారంపై బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ఈటల రాజేందర్ తెలంగాణ కోసం పోరాడిన నాయకుల్లో ముఖ్యమైన వ్యక్తని ఆయ‌న కొనియాడారు. ఆయన బీజేపీలో చేరితే పార్టీ బలం పుంజుకుంటుంద‌ని రాజాసింగ్‌ అభిప్రాయపడ్డారు.

Also Read: TPCC: ఢిల్లీలో మళ్లీ తెరపైకి వచ్చిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి వ్యవహారం.. రెండు, మూడు రోజుల్లో క్లారిటీ..!

Heavy Rains: కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు.. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

H1B Visa Scam: అమెరికాలో వెలుగులోకి మ‌రో ఘ‌రానా మోసం.. హైద‌రాబాద్ కేంద్రంగా హెచ్‌1బీఈ వీసా స్కామ్‌..