కాంగ్రెస్‌కు ఓరుగల్లు సెంటిమెంట్.. కీలక సభలకు వేదికగా ఆ గ్రౌండే ఎందుకంటే..?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వరంగల్‌లో భారీ బహిరంగ సభకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. దాదాపు లక్ష మంది జన సమీకరణ లక్ష్యంగా భారీ సభకు కాంగ్రెస్ శ్రేణులు శ్రీకారం చుట్టాయి. అయితే ఈ సభను కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ ప్లేస్ హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్‌కు ఓరుగల్లు సెంటిమెంట్.. కీలక సభలకు వేదికగా ఆ గ్రౌండే ఎందుకంటే..?
Representative Image
Follow us
G Peddeesh Kumar

| Edited By: Ravi Kiran

Updated on: Nov 19, 2024 | 9:07 AM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వరంగల్‌లో భారీ బహిరంగ సభకు సన్నాహాలు జరుగుతున్నాయి. దాదాపు లక్ష మంది జన సమీకరణ లక్ష్యంగా భారీ సభకు కాంగ్రెస్ శ్రేణులు శ్రీకారం చుట్టాయి. అయితే ఈ సభను కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ ప్లేస్ హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్నారు. 19వ తేదీన నిర్వహించే ఈ సభ ద్వారా తమ సత్తా చాటుతామని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు. ఇంతకీ ఈ గ్రౌండ్ అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనుక హన్మకొండలోని ఈ గ్రౌండ్ సెంటిమెంట్ ఉందని భావిస్తున్నారు. 2003లో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ సభ జరిగింది. ఆ సభకు సోనియాగాంధీ హాజరయ్యారు. అటు 2023లో అధికారంలోకి రావడానికి కూడా ఈ మైదానమే సెంటిమెంట్ గా భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు 2022 మే 6వ తేదిన రైతు డిక్లరేషన్ సభ నిర్వహించిన ప్రదేశం హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం కావడం విశేషం. ఇక్కడ నిర్వహించిన రైతు డిక్లరేషన్ సభకు ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని అదేవిధంగా రైతులకు సంబంధించి కొన్ని వరాలు ప్రకటించారు..

రైతు డిక్లరేషన్ ప్రకటించిన ఈ స్థలం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన సెంటిమెంట్ స్థలంగా భావిస్తున్నారు.. మొదటి విడత రుణమాఫీ జరిగిన సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ స్థలంలోనే పుష్పాభిషేకం, సంబరాలు జరుపుకున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ కొలువుతీరి ఏడాది కావస్తుంది. డిసెంబర్ 7వ తేదీ నాటికి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. ఈ నేపద్యంలో వరంగల్ సెంటిమెంట్ ను మరోసారి వర్కౌట్ చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ..

కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్ మైదానంగా భావిస్తున్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలోనే ఇప్పుడు ఏడాది పాలన విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. నవంబర్ 19వ తేదీన నిర్వహించే ఈ సభ ప్రాంగణానికి ఇందిర మహిళా శక్తి సభా ప్రాంగణంగా నామకరణం చేశారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ భారీ బహిరంగ సభ స్వీకారం చుట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు క్యాబినెట్ మొత్తం ఈ సభకు రాబోతున్నారు. లక్ష మంది ప్రజలు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ప్రాంగణం లో 20 పైగా స్థాల్స్ ఏర్పాటు చేశారు. హనుమకొండ పట్టణం మొత్తం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జెండాలు, హోర్డింగ్స్, కటౌట్ల తో నిండిపోయింది.

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా హనుమకొండ బాలసముద్రంలో నిర్మించిన కాళోజి కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు. నయీంనగర్ బ్రిడ్జిని అక్కడి నుండే ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తారు.. దీంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.. అదేవిధంగా 22 జిల్లాల్లో నిర్మించినున్న శ్రీ శక్తి భావణాల నిర్మాణానికి ఇక్కడే శంకుస్థాపన చేస్తారు.