AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. పండగ పూట తెలంగాణలో పొలిటికల్ ఫైట్.. కౌశిక్ రెడ్డి అరెస్ట్..

కరీంనగర్‌ కలెక్టరేట్‌లో ఆదివారం జరిగిన జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వ పథకాలపై చర్చ జరుగుతున్న సమయంలో.. ఒక్కసారిగా ఎమ్మెల్యే సంజయ్‌ దగ్గరకు వెళ్లారు కౌశిక్ రెడ్డి. ఏ పార్టీ నీదంటూ నిలదీశారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

Telangana: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. పండగ పూట తెలంగాణలో పొలిటికల్ ఫైట్.. కౌశిక్ రెడ్డి అరెస్ట్..
Padi Kaushik Reddy Vs Sanjay
Shaik Madar Saheb
|

Updated on: Jan 13, 2025 | 8:03 PM

Share

బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. పండగ పూట తెలంగాణలో పొలిటికల్ ఫైట్ కొనసాగుతుంది. నిన్న కరీంనగర్‌ కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో కౌశిక్‌ రెడ్డి తనను దూషించారని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌. కౌశిక్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ కేసులో సంజయ్‌ స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు.. కలెక్టర్‌లో కొట్లాట విషయంలో కౌశిక్ రెడ్డిపై ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. సంజయ్‌ పీఏ ఫిర్యాదుతో ఒక కేసు నమోదు చేశారు పోలీసులు. సమావేశంలో గందరగోళానికి కారణమయ్యారన్న RDO మహేశ్వర్ ఫిర్యాదుతో రెండో కేసు నమోదు చేశారు. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై మూడో కేసు నమోదు చేశారు పోలీసులు.. మొత్తంగా కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి.. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు.. పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కరీంనగర్ వన్ టౌన్ కు తరలిస్తున్నారు.

కరీంనగర్ లో నిన్నటి సమావేశంలో కౌశిక్‌రెడ్డి తనపై దాడి చేశారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొంటున్నారు.. తాను ఎవరినీ దూషించలేదని పేర్కొన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌లో చేరినవారు రాజీనామా చేశారా అని ఆయన ప్రశ్నించారు.. కేసీఆర్ క్షమాపణ చెబితే తానే రాజీనామా చేస్తానని సంజయ్‌ పేర్కొన్నారు.

కాగా.. ఈ ఘటనపై కాంగ్రెస్.. బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. అయితే, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసులు నమోదు చేయడాన్ని బీఆర్‌ఎస్ తప్పుబడుతోంది. సంజయ్ రెచ్చగొట్టడం వల్లే కౌశిక్‌కు కోపం వచ్చింది. ఆవేశంలోనే అలా ప్రవర్తించారని బీఆర్‌ఎస్ వాదిస్తోంది. ఒక ఎమ్మెల్యేను పోలీసులు లాక్కెళ్లడాన్ని ఖండించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. పోలీసులు వెంటనే కౌశిక్‌రెడ్డిపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై రసమయి బాలకిషన్ ఫైర్ అయ్యారు. సంజయ్‌పై కౌశిక్ రెడ్డి దాడి చేశారని ఆరోపిస్తున్నారని.. కానీ తనపై ఎవరూ దాడి చేయలేదని ఆయన చెప్పారన్నారు. అలాంటప్పుడు కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.

కౌశిక్‌రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్‌రెడ్డి ఓ సైకోలా ప్రవర్తించారని మండిపడ్డారు. ఫిరాయింపులపై ముందు బీఆర్‌ఎస్‌ను ప్రశ్నించాలన్నారు.

మొత్తంగా కాంగ్రెస్ నేతల వార్నింగ్‌లు, బీఆర్ఎస్ నేతల కౌంటర్లు.. రాజకీయంగా వేడిపుట్టిస్తున్నాయి.

ఆదివారం ఏం జరిగిందంటే..

కరీంనగర్‌ కలెక్టరేట్‌లో ఆదివారం జరిగిన జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వ పథకాలపై చర్చ జరుగుతున్న సమయంలో.. ఒక్కసారిగా ఎమ్మెల్యే సంజయ్‌ దగ్గరకు వెళ్లారు కౌశిక్ రెడ్డి. ఏ పార్టీ నీదంటూ నిలదీశారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశంలో చేయి చేసుకున్నంత పనిచేశారు. పక్కనే ఉన్న వాళ్లంతా వారిని సముదాయించే ప్రయత్నం చేశారు అయినా వెనక్కి తగ్గకపోవడంతో ఇరువుర్ని బయటకు తీసుకెళ్లారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..