National Turmeric Board: ఎన్నో ఏళ్ల కల సాకారం.. జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి..

ఎన్నో ఏళ్ల పసుపు రైతుల కల ఫలించింది. ఎట్టకేలకు పసుపు బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం దానికి చైర్మన్‌ను ప్రకటించింది. జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సోమవారం ప్రకటన విడుదల చేసింది..

National Turmeric Board: ఎన్నో ఏళ్ల కల సాకారం.. జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి..
National Turmeric Board
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 13, 2025 | 8:56 PM

సంక్రాంతి పండుగ వేళ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. ఎన్నో ఏళ్ల పసుపు రైతుల కలను సాకారం చేస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది.. ఎట్టకేలకు పసుపు బోర్డు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. బోర్డును ఏర్పాడు చేయడంతోపాటు.. దానికి చైర్మన్‌ను సైతం ప్రకటించింది. జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటన విడుదల చేసింది.. పల్లె గంగా రెడ్డి మూడేళ్ల పాటు టర్మరిక్ బోర్డు చైర్మన్‌గా కొనసాగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

గంగారెడ్డి ప్రస్తుతం బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.. కాగా… రేపు జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండనుంది. నిజామాబాద్‌ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కానుంది.

ఎన్నికల సమయంలో అలాగే.. గతంలో పలు మార్లు తెలంగాణలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తెలంగాణలో నేషనల్ టర్మరిక్ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.. ఆ హామీని సంక్రాంతి పండుగ వేళ నెరవేరుస్తూ ప్రకటన విడుదల చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

ప్రధాని మోదీకి ధన్యవాదాలు : ఎంపీ ధర్మపురి అర్వింద్

నిజామాబాద్‌లో పసుపుబోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.. రేపు అధికారికంగా పసుపుబోర్డు ఆఫీస్ ప్రారంభంకానుందన్నారు. పసుపు రైతుల దశాబ్దాల కలను నెరవేర్చిన ప్రధాని మోదీకి ఎంపీ ధర్మపురి అర్వింద్ ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..