AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elections 2024: ఓటర్ గుర్తింపు కార్డు లేదా.. ఓటింగ్ కోసం 13 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపవచ్చు..!

స్వతంత్ర భారతంలో ఓ చరిత్రాత్మకమైన ఘట్టం ముందు మనం నిలిచివున్నాం. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక ఎన్నికలకు సిద్ధమయ్యాం. రెండు రాష్ట్రాల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో అర్బన్‌ ఓటింగ్‌ ఎలా జరుగుతుంది అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అన్నిటికీ మించి యువతను ఓటింగ్‌ ప్రక్రియలో ఎలా భాగస్వాములను చేయాలి అనే చర్చ జరుగుతోంది.

Elections 2024: ఓటర్ గుర్తింపు కార్డు లేదా.. ఓటింగ్ కోసం 13 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపవచ్చు..!
Voter Id Not Available
Balaraju Goud
| Edited By: Janardhan Veluru|

Updated on: May 13, 2024 | 8:37 AM

Share

స్వతంత్ర భారతంలో ఓ చరిత్రాత్మకమైన ఘట్టం ముందు మనం నిలిచివున్నాం. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక ఎన్నికలకు సిద్ధమయ్యాం. రెండు రాష్ట్రాల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో అర్బన్‌ ఓటింగ్‌ ఎలా జరుగుతుంది అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అన్నిటికీ మించి యువతను ఓటింగ్‌ ప్రక్రియలో ఎలా భాగస్వాములను చేయాలి అనే చర్చ జరుగుతోంది. తెలుగు నాట మరికొద్ది గంటల్లో పోలింగ్‌ జరుగుతున్న తరుణంలో.. ఓటర్లలో చైతన్యం నింపే ప్రయత్నంలో ఉన్నారు ఎన్నికల అధికారులు.

తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల హడావిడి ఎక్కువగా ఉండనుంది. ఓటర్లు అందరూ వారి ఓటు హక్కును రేపు వినియోగించుకోనున్నారు. ఓటు వేయాంటే ఓటర్ కార్డు లేదా ఓటర్ స్లిప్ వంటివి ఉండాలి. ఇప్పటికే ఓటర్లకు ఈ ఓటర్ స్లిప్స్ అంది ఉంటాయి. ఒక వేళ ఇవి లేకపోతే.. ఏం చేయాలి? ఓటు వేయవచ్చా? లేదా? వంటి అంశాలను మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఎన్నికల సంఘం ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

ఓటర్ ఐడీ లేకపోతే ఏం చేయాలి? వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ ఈ ఐడెంటిటీ డాక్యుమెంట్ కార్డ్‌ను పోలింగ్ కేంద్రానికి తీసుకురాలేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐడెంటిటీ వెరిఫై చేసుకునే విషయంలో ఎన్నికల సంఘం ఓటర్లకు కొన్ని సడలింపులు ఇచ్చింది. ఓటర్ ఐడీ కార్డ్‌ లేకపోతే, దానికి బదులుగా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వంటి కొన్ని గుర్తింపు కార్డులలో దేనినైనా ఉపయోగించి ఓటు వేయవచ్చు. ఏయే డాక్యుమెంట్స్ పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లవచ్చో తెలుసుకుందాం.

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేటపుడు ఎపిక్ కార్డు లేని వారు 13 రకాల కార్డులలో ఏదైనా ఒక దానిని తమ వెంట తీసుకెళ్లాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు.

1) ఓటర్ గుర్తింపు కార్డు

2) ఆధార్ కార్డు

3) ఎం.ఎన్.ఆర్.ఇ. జి.ఏ.జాబ్ కార్డు

4) ఫోటోతో ఉన్న బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్

5) కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు

6) డ్రైవింగ్ లైసెన్స్

7) పాన్ కార్డ్

8) కార్మిక మంత్రిత్వ శాఖ పథకం ద్వారా జారీచేసిన స్మార్ట్ కార్డు

9) పాస్‌పోర్ట్

10) ఫోటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్

11) కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వంచే జారీ చేయబడిన ఉద్యోగ గుర్తింపు కార్డు

12) ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు

13) యూనిక్ డిసేబిలిటీ గుర్తింపు కార్డు

పైన వివరించిన 13) గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకదానిని చూపించి ఓటు వేయవచ్చని ఆయన సూచించారు. మే 13వ తేదీన జిల్లాలోని ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని.. ఓటింగ్‌ శాతాన్ని పెంచాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…