Vikarabad: డప్పు పునర్జీవం కోసం.. కొత్త తరానికి అందిచడం కోసం… గొప్ప ప్రయత్నం
గ్రామీణ ప్రాంతాల్లో, అంతరించిపోతున్న డప్పు కలను గుర్తించి, డప్పు ప్రాముఖ్యతను చాటి చెబుతూ, డప్పు కళాకారులకు తన వంతుగా సహాయం అందచేస్తున్నారు వికారాబాద్ జిల్లా లగోరీ అధ్యక్షుడు డాక్టర్ టీ ఆనంద్.
ఒకానొకప్పుడు పల్లె జనం గుండెచప్పుడుగా మార్మోగింది డప్పు. డప్పు చప్పుడు వినిపిస్తేనే ఓ వైబ్రేషన్. డప్పుతో తీన్మార్ కొడితే.. కాలు కదపకుండా ఎవరు ఉండగలరు చెప్పండి. డప్పు దరువు అనేది ప్రాచీనమైన కళ. గ్రామాలలో డప్పు వాయిద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. గతంలో పెళ్ళిళ్ళ సందర్భంలో ఎన్ని ఎక్కువ డప్పులు ఉపయోగిస్తే ఆ పెళ్ళి ఊరేగింపు గురించి అంత గొప్పగా చెప్పుకునేవారు. అప్పట్లో ప్రతి కార్యక్రమానికి డప్పు ఉండాల్సిందే. ఈ నాటికీ చాలా పల్లెల్లో డప్పు ద్వారానే చాటింపు వేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కనుమరుగవుతున్న ప్రాచీణ కళల్లో డప్పు కూడా ఒకటి. మరుగున పడిన డప్పు కళను పైకి తెచ్చి కుల మతాలతో సంబంధం లేకుండా కొత్త తరానికి అందిచాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఆ పని కోసం కోసం పూనుకున్నారు వికారాబాద్ జిల్లా లగోరీ అధ్యక్షుడు డాక్టర్ టీ ఆనంద్.
డప్పు అనేది పురాతనమైన వాయిద్యం అని.. దాని పునర్జీవం కోసమే తన ప్రయత్నమని ఆనంద్ చెబుతున్నారు. అందులో భాగంగా వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండల కేంద్రంలో డప్పు దరువు పోటీలను నిర్వహించారు. పోటీలలో తెలంగాణా రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులను ప్రధానం చేశారు టీ ఆనంద్. డప్పు దరువు పురాతన ఆది కళ అని.. దాన్ని నమ్ముకున్న.. కాపాడుకుంటున్న కళాకారులను ప్రోత్సాహించేందుకే ఇది తన వంతు ప్రయత్నమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద్ పటేల్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం