AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikarabad: బయటపడ్డ కొత్త కోణం.. కలెక్టర్ సహా వచ్చిన అధికారులను చంపేయాలనుకున్నారా..?

ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే..!

Vikarabad: బయటపడ్డ కొత్త కోణం.. కలెక్టర్ సహా వచ్చిన అధికారులను చంపేయాలనుకున్నారా..?
Attack On Collector
Vijay Saatha
| Edited By: Balaraju Goud|

Updated on: Nov 13, 2024 | 1:02 PM

Share

నవంబర్‌ 11న వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన దాడి ఘటన వెనుక కుట్రకోణం బయటపడింది. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి సంబంధించి న విషయాలు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈనెల 11న వికారాబాద్ జిల్లాలో ప్రజాప్రతి సేకరణ కోసం కలెక్టర్ తోపాటు ఉన్నతాధికారులు జిల్లా హెడ్ క్వార్టర్‌కు చేరుకున్నారు. అయితే ముందు రోజు రాత్రి అధికారులు అందరూ ప్రజాభిప్రాయ సేకరణ కోసం వస్తున్నారని తెలుసుకున్న పలువురు వ్యక్తులు అధికారులను చంపేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్ని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.

ఈ దాడిలో మొత్తం 46 మంది పాల్గొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరిలో 16 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా మిగతా 30 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరిలో ప్రధాన నిందితుడిగా పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు సురేష్ ఉన్నాడు.. అయితే ప్రస్తుతం సురేష్ తో పాటు మరి కొంతమంది పరారీలో ఉన్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరోవైపు దాడికి పాల్పడ్డ వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వీరిపై అటెంప్ట్ మర్డర్ కేస్ తో పాటు మొత్తం ఎనిమిది సెక్షన్ల కింద కేసులలో నమోదు చేశారు. పక్క ప్లాన్ ప్రకారమే ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చే అధికారులపై దాడులు చేసే విధ్వంసం సృష్టించాలని కుట్రపన్నారు. ఇందులో భాగంగానే వికారాబాద్‌లో కాకుండా లగచర్లకి వచ్చి రైతులతో మాట్లాడాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే లగచర్ల నుండి సురేష్‌ను వికారాబాద్‌కు పంపించారు. వికారాబాద్‌లో ఉన్న కలెక్టర్ తోపాటు మిగతా అధికారులను లగచర్ల వచ్చేలాగా సురేష్ ప్రేరేపించాడు. లగచర్ల చేరుకోగానే కలెక్టర్ తోపాటు మిగతా అధికారులపై ఒక్కసారిగా మూకుమూడి దాడికి పాల్పడ్డారు. అధికారులపై దాడితోపాటు అధికారులు ప్రయాణిస్తున్న వాహనాలను రాళ్లతో ద్వంసం చేశారు.

ఈ మొత్తం ఘటనపై వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మరాజుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో సురేష్ ను ఏ 1 గా పోలీసులు చేర్చారు. మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం 30 మంది అసలు నిందితులు ఇంకా పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ కొనసాగుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..