AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అధికారులపై దాడి, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం.. ఒక్కసారి కేసు నమోదైతే జీవితం అంధకారమే…

నిరసనలు, ఆందోళనలు శాంతియుతంగా సాగితే ఎలాంటి సమస్య లేదు. కానీ ఏ మాత్రం హద్దులు మీరినా... ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన, అధికారులపై చేయి చేసుకున్నా.. భవిష్యత్తు అంధకారమయ్యే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం లగచర్ల గ్రామంలో అధికారులపై దాడి ఘటన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.

అధికారులపై దాడి, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం.. ఒక్కసారి కేసు నమోదైతే జీవితం అంధకారమే...
Lagacharla Incident
Boorugu Shiva Kumar
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 13, 2024 | 2:51 PM

Share

నిరసనలు, ఆందోళనలు శాంతియుతంగా సాగితే ఎలాంటి సమస్య లేదు. కానీ ఏ మాత్రం హద్దులు మీరినా… ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన, అధికారులపై చేయి చేసుకున్నా.. భవిష్యత్తు అంధకారమయ్యే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం లగచర్ల గ్రామంలో అధికారులపై దాడి ఘటన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఏకంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై చేయి చేసుకోవడం, ఇతర అధికారులపై కర్రలు, రాళ్లతో దాడులు చేయడం తీవ్ర దూమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో అందోళనలు, ధర్నాల్లో హద్దుమీరి ప్రవర్తించినా.. అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, వారిపై భౌతిక దాడులకు పాల్పడితే ఎదురయ్యే పరిణామాలు చాలా కఠినంగా ఉంటాయి. క్షణికావేశంలో ఏ చిన్న తప్పు చేసినా.. ఆ తదుపరి నమోదయ్యే కేసులు, పెట్టె సెక్షన్లు జీవితాంతం కుమిలిపోయేలా చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే స్వయంగా జీవితంలో అంధకారం నింపుకున్నట్లే..

ప్రభుత్వ అధికారులు, ఆస్తుల ధ్వంసం చేస్తే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దాం..

వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగులతో దురుసు, అనుచిత ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లో సహించేదిలేదని చట్టం చెబుతోంది. ఈ సందర్భంలో అసలు సమస్య పరిష్కారం కాకపోగా… కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు ప్రతి ఒక్కరు ప్రభుత్వ ప్రతినిధిగా ఉంటారు. అలాంటి వారి విధులను గౌరవించాల్సి ఉంటుంది. వారితో సత్పప్రవర్తన కలిగి ఉండడం ఎంతో ముఖ్యం. ఏ ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినా… వారిపై భౌతిక దాడులకు దిగిన, ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేసినా శిక్షార్హులు అవుతారు.

కేసులు.. సెక్షన్లు.. ఇలా

ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు హద్దు మీరితే ప్రధానంగా జరిగేది ప్రభుత్వ ఆస్తులు లేదా వాహనాలు ధ్వంసం అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పాటు అధికారుల పట్ల దురుసు ప్రవర్తన, వారి విధులను అడ్డుకోవడం, భయభ్రాంతులకు గురిచేయడం, హత్యాయత్నం వంటివి చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ.. చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడటం లేదు. ప్రభుత్వ అధికారుల విధులను అడ్డుకొని ఆటంకం కలిగించడం బీఎన్ఎస్ చట్టం సెక్షన్ 132 కింద నేరంగా పరిగణిస్తారు. ఆస్తుల విధ్వంసం, వాహనాలు ధ్వంసం చేయడం చేస్తే పీడీపీ చట్టం సెక్షన్ 3,4 కింద కేసులు నమోదు చేస్తారు. అధికారులను, సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడం, గాయపర్చడం చేస్తే బీఎన్ఎస్ చట్టం 118,180 సెక్షన్ల కింద కేస్ ఫైల్ చేస్తారు. ఇక హత్యాయత్నం వంటి కేసులు బీఎన్ఎస్ సెక్షన్ 109 కింద కేసు నమోదు చేస్తారు. ఇవే కాకుండా ఘటన తీవ్రతను బట్టి వివిధ సెక్షన్లు ఉపయోగిస్తారు పోలీసులు. ఇక ఇందులో హత్యాయత్నం కింద పదేళ్ల వరకు శిక్ష లేదంటే జరిమానా విధించవచ్చు. నేరం రుజువు అయితే ఒక్కో సందర్భంలో రెండు అమలు చేసే అవకాశం ఉంటుంది.

ఘటనలు జరిగే సందర్భం, కారణాలు ఏవైనా ఆ తర్వాత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. క్షణికావేశంలోనైనా… రెచ్చిపోయి చేసిన చట్టం మాత్రం చూస్తు ఊరుకోదు. యువతకు ఉద్యోగ ప్రయత్నాలు, విదేశాలకు వెళ్లాల్సిన వారికి ఈ పరిణామాలు ఆటంకంగా మారుతాయి. అన్ని వదులుకొని కోర్టుల చుట్టూ తిరగడమే కాకుండా.. నేరం రుజువైతే కటకటలాపాలవ్వాల్సిందే. అందుకే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సత్పప్రవర్తన కలిగి ఉండడంతో పాటు ప్రభుత్వ ఆస్తుల పట్ల విధ్వంస వైఖరిని వీడనాడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..