Telangana: ఎరక్కపోయి ఇరుక్కుంది.. ఇంటికి వచ్చిన పామును ఏకంగా ముద్దు పెట్టుకున్న పూజారి..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేటలోని ఒక పూజారి ఇంటి సమీపంలోకి వచ్చింది. పాము తల ఒక గ్లాసులో ఇరుక్కుని, బయటకు రాలేక ఇబ్బంది పడుతూ కనిపించింది.

Telangana: ఎరక్కపోయి ఇరుక్కుంది.. ఇంటికి వచ్చిన పామును ఏకంగా ముద్దు పెట్టుకున్న పూజారి..!
Man With Snake
Follow us
N Narayana Rao

| Edited By: Balaraju Goud

Updated on: Nov 13, 2024 | 12:42 PM

పాము అంటే కొంతమందికి భయం. కొంతమందికి భక్తి. కానీ ఈ పాముల్లో కూడా రకరకాల పేర్లు ఉంటాయి. విభిన్న మైన పాములు కూడా ఉంటాయి. అలాంటి విభిన్నమైన పాము జాతిలో రెండు తలల పాము ఒకటి. ఈ పాము కోసం ఎంతో మంది రహస్యంగా, అడవుల్లో పొలాల్లో వెతుకుతూ ఉంటారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ రెండు తలల పామును అమ్మితే బాగా డబ్బులు వస్తాయని ఒక పుకారు వ్యాపించడంతో స్మగ్లర్లు ఈ పాము కోసం విపరీతంగా అన్వేషణ జరుపుతుంటారు.

ఇలాంటి రెండు తలల పాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేటలోని ఒక పూజారి ఇంటి సమీపంలోకి వచ్చింది. పాము తల ఒక గ్లాసులో ఇరుక్కుని, బయటకు రాలేక ఇబ్బంది పడుతూ కనిపించింది. అది చూసిన దమ్మపేట శివాలయంలో పని చేసే మారుతి శర్మ అనే పూజారి, మనస్సు చలించిపోయింది. పామును రక్షించే ప్రయత్నం చేశారు. గ్లాసులో తల ఇరుక్కున్న పామును బయటకు తీసి, దానిని అక్కున చేర్చుకొన్నారు.

అంతేకాదు దానిని ముద్దాడి కొంచెం సేపు దానితో అడుకొన్నాడు. చుట్టూ పక్కల స్థానికులు కూడా పూజారి పాముతో ఆదుకోవడం చూసి ఆనందపడ్డారు. దానిని అక్కడ వదిలిస్తే, ఎవరైనా దానిని ఎత్తుకెళ్ళి అమ్మేస్తారని అనుమానంతో పూజారి శర్మ ఆ పామును స్థానిక ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. ఈ రెండు తలల పామును ఫారెస్ట్ అధికారులు సురక్షితంగా అడవిలో వదిలిపెట్టారు. ఈ విషయం తెలిసిన స్థానికులు పూజారిని అభినందించారు..

వీడియో చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..