AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijaya Dairy Milk: పాల ధర పెంపు.. ఎంతో తెలుసా..?

Vijaya Dairy Milk: నిత్యావసర సరుకుల ధరలతో పాటు పాల ధరలు ఇప్పటికే పెరిగిపోయాయి. ఇక విజయ డెయిరీ పాల సేకరణ ధర పెరగనుంది. విజయ డెయిరీ చైర్మన్‌ లో భూమారెడ్డి,.

Vijaya Dairy Milk: పాల ధర పెంపు.. ఎంతో తెలుసా..?
Subhash Goud
|

Updated on: Feb 16, 2022 | 7:19 AM

Share

Vijaya Dairy Milk: నిత్యావసర సరుకుల ధరలతో పాటు పాల ధరలు ఇప్పటికే పెరిగిపోయాయి. ఇక విజయ డెయిరీ పాల సేకరణ ధర పెరగనుంది. విజయ డెయిరీ చైర్మన్‌ లో భూమారెడ్డి, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అధర్‌ సిన్హా మంగళవారం హైదరాబాద్‌లోని విజయ డెయిరీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఉన్న పాల సేకరణ ధరకు అదనంగా లీటర్‌కు రూ.4 చొప్పున పెంచాలని అధర్‌ సిన్హాను డెయిరీ చైర్మన్‌ భూమారెడ్డి కోరారు. లీటర్‌కు రూ.2 పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని, రూ.4 పెంచాలనే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామని అధర్‌ సిన్హా పేర్కొన్నారు. అయితే బుధవారం నుంచి కొత్త ధరలు అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. ఒక వేళ పెంచినట్లయితే రూ.2 పెంచుతారా..? లేక రూ.4 పెంచుతారా..? అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం గేదె పాలకు లీటర్‌కు రూ.40 నుంచి రూ.45 మధ్య రైతులకు చెల్లిస్తున్నారు.

లీటర్‌ ఆవు పాలకు గరిష్టంగా రూ.28 వరకు చెల్లిస్తున్నారు. అయితే పాడి రైతులు మాత్రం ఈ ధర సరిపోవడం లేదని, గేదె పాలకు (6శాతం ఫ్యాట్‌పై) లీటర్‌కు రూ.55, ఆవుపాలు (3 శాతం ఫ్యాట్‌పై) లీటర్‌కు రూ.35 చొప్పున చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ నుంచి మరో టూర్‌ ప్యాకేజీ.. పూర్తి వివరాలు

Google: జాక్‌పాట్‌ కొట్టేశాడు.. గూగుల్‌ నుంచి రూ.65 కోట్ల రివార్డు.. ఎందుకో తెలుసా..?