Telangana: ఇన్‌స్టాలో 5నెలల పరిచయం.. ఇంతలో ప్రేమ ప్రపోజల్.. చివరికి ఏం జరిగిందంటే..!
బీ-ఫార్మసీ చదువుతున్న యువతకి సోషల్ మీడియా ద్వారా ఓ యువకుడు పరిచయం అయ్యాడు. తర్వాత ప్రేమించమని వెంటపడ్డాడు. తన ప్రేమను నిరాకరించడంతో వేధించడం మొదలుపెట్టాడు. చివరికి వేధింపులు తాళలేక ఆ యువతీ నాలుగు అంతస్తుల బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
బీ-ఫార్మసీ చదువుతున్న యువతకి సోషల్ మీడియా ద్వారా ఓ యువకుడు పరిచయం అయ్యాడు. తర్వాత ప్రేమించమని వెంటపడ్డాడు. తన ప్రేమను నిరాకరించడంతో వేధించడం మొదలుపెట్టాడు. చివరికి వేధింపులు తాళలేక ఆ యువతీ నాలుగు అంతస్తుల బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు చోటు చేసుకుంది.
దోమగుడ ప్రాంతానికి చెందిన బీఫార్మసీ స్టూడెంట్ తేజస్విని అదే గ్రామానికి చెందిన శ్రీహరి ఇంస్టాగ్రామ్‌లో ఐదు నెలల క్రితం పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ఇద్దరు మధ్య ఫ్రెండ్లీ చాటింగ్ కొనసాగుతోంది. గత కొద్ది రోజుల నుంచి శ్రీహరి ఇంస్టాగ్రామ్‌లో ప్రేమిస్తున్నాను అంటూ ఒత్తిడి చేశాడు. ఇది తెలిసిన తల్లిదండ్రులకు పెద్దల దృష్టికి తీసుకెళ్లింది తేజస్విని. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి మందలించారు. అయినా తన తీరు మార్చుకోకుండా శ్రీహరి, తేజస్విని ని మరింత వేధింపులకు గురి చేశాడు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన తేజస్విని గురువారం(ఆగస్ట్ 8) రాత్రి తాను ఉంటున్న బిల్డింగ్‌లో నాలుగో అంతస్తు పైకి వెళ్లి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను తల్లిదండ్రులు సూరారంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అయితే, అప్పటికే మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. ఈ ఘటనకు సంబంధిచి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ కేసులో నిందితుడు శ్రీహరి జులాయిగా తిరుగుతూ తరచూ అమ్మాయిలను వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
మరోవైపు యువతి సూసైడ్‌తో శ్రీహరి సైతం ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం శ్రీహరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తేజస్విని ఆత్మహత్యకు కారణమైన శ్రీహరిని కఠినంగా శిక్షించాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..