Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుంకీ ఏనుగులు ఏం చేస్తాయి..? ఊళ్లల్లోకి వస్తున్న అడవి ఏనుగుల్ని ఎలా దారికి తెస్తాయి?

కుంకీ ఏనుగులు ఏం చేస్తాయి..? ఊళ్లల్లోకి వస్తున్న అడవి ఏనుగుల్ని ఎలా దారికి తెస్తాయి?

Ravi Panangapalli

|

Updated on: Aug 10, 2024 | 3:45 PM

కుంకీ ఏనుగులు వస్తే.. ఇక అడవి ఏనుగుల బాధ తగ్గుతుంది. జనావాసాల్లోకి వీటి రాకను అడ్డుకోవడానికి వీలుపడుతుంది. కొన్నేళ్లుగా వీటితో పడ్డ సమస్యలు తొలగిపోతాయి. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించినట్లు అవుతుంది. ఇంతకీ కుంకీ ఏనుగులు నిజంగానే అంత ప్రత్యేకమైనవా?

ఏనుగమ్మా ఏనుగు మా వూరొచ్చే ఏనుగు అని చిన్నప్పుడు చాలామంది పాట పాడుకుని ఉండొచ్చు. కానీ కొన్ని ఊళ్లు మాత్రం.. అటవీ ఏనుగులను తమ ఊరికి రావద్దనే కోరుకుంటున్నాయి. ఎందుకంటే అవి చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు. పంటలను పాడుచేస్తాయి. అడ్డొచ్చే వారిని చంపేస్తాయి. ఊళ్లను ధ్వంసం చేస్తాయి. దీంతో ఏనుగులంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఏపీలో చిత్తూరు, పార్వతీపురం ప్రాంతాల్లో గజరాజుల పేరు చెబితేనే ఆందోళన చెందుతారు. ఎందుకంటే.. వాటి వల్ల జరిగే నష్టం.. వచ్చే కష్టం సంగతి వాళ్లకు తెలుసు. అందుకే.. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కుంకీ ఏనుగుల కోసం.. బెంగళూరు ప్రభుత్వంతో మాట్లాడడం.. అక్కడి సర్కారు వాటిని ఇస్తానని చెప్పడంతో గజరాజుల బాధితులకు ఉపశమనం లభించనుంది. ఇంతకీ ఈ కుంకీ ఏనుగులు ఏం చేస్తాయి? అడవి ఏనుగులను అవి ఎలా దారికి తెస్తాయి? అసలు వాటి స్పెషల్ ఏమిటి?  ఆ వివరాలు వీడియోలో చూడండి. మరిన్ని ప్రీమియం  కథనాల కోసం TV9 News APP  డౌన్‌లోడ్ చేసుకోండి.