AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: 90ML తాగినంత మాత్రాన పోలీసులు వేధిస్తారా..? నడిరోడ్డుపైనే పెద్దాయన వీరంగం

ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడంటే అప్పుడు తమ ఇష్టానుసారంగా తనిఖీలు నిర్వహిస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఒక పెద్దాయనకు కోపం వచ్చింది. ఏకంగా నడిరోడ్డు మీదే పోలీసులను ప్రశ్నిస్తూ నిలదీశాడు. అప్పటికీ మద్యం తాగేసి ఉన్నాడేమో..! ఎవరినీ లెక్క చేయకుండా తన తప్పు ఏముందని నిలదీశాడు.

Hyderabad: 90ML తాగినంత మాత్రాన పోలీసులు వేధిస్తారా..? నడిరోడ్డుపైనే పెద్దాయన వీరంగం
Drunk Oldman
Noor Mohammed Shaik
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 10, 2024 | 1:26 PM

Share

ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడంటే అప్పుడు తమ ఇష్టానుసారంగా తనిఖీలు నిర్వహిస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఒక పెద్దాయనకు కోపం వచ్చింది. ఏకంగా నడిరోడ్డు మీదే పోలీసులను ప్రశ్నిస్తూ నిలదీశాడు. అప్పటికీ మద్యం తాగేసి ఉన్నాడేమో..! ఎవరినీ లెక్క చేయకుండా తన తప్పు ఏముందని నిలదీశాడు. అసలేంటీ కథ.. ఎవరతనే వివరాలు ఇప్పుడు చూద్దాం..!

హైదరాబాద్ మహా నగరంలోని పాతబస్తీ బహదూర్‌పురా ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించే సమయంలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులను ఆపి చలాన్ విధిస్తున్నారు. ఈ క్రమంలోనే మద్యం సేవించిన వచ్చిన ఓ పెద్దాయన అటుగా వచ్చాడు. దీంతో అతన్ని ఆపిన ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించేందుకు సిద్ధమయ్యారు. అంతే ఇంకేముంది ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చిన ఆయన రెచ్చిపోయాడు. నడి రోడ్డు మీద వీరంగం సృష్టించాడు.

ట్రాఫిక్ పోలీసులు ఇష్టానుసారంగా ఎప్పుడంటే అప్పుడు తనిఖీలు నిర్వహించి మమ్మల్ని వేధిస్తున్నారని ఓ వృద్ధుడు నానా హంగామా చేశాడు. మూసీలో అనాథ శవాలు దొరికితే మా ద్వారా ఎత్తించి మార్చురీకి తరలిస్తారని చెప్పుకొచ్చాడు. అయినా ఒక్క రూపాయి కూడా ఇవ్వరని ఫిర్యాదు చేశాడు. శవాలను ఎత్తించి ఉస్మానియాకి తరలిస్తారని, తనకు మాత్రం పోలీసులు అలా చేసినందుకు ఏమీ ఇవ్వట్లేదని వీరంగం సృష్టించాడు. డ్యూటీలో ఉన్న పోలీసుల మీద అలా ప్రవర్తించడం తప్పు అని అక్కడ ఉన్నవాళ్లు చెప్పినా ఆ పెద్దాయన పట్టించుకునే స్థితిలో లేడు. ఎవరెంత సముదాయించి అక్కడ నుంచి అతనిని తీసుకెళ్దామని ప్రయత్నించినా ఎవ్వరి మాట వినలేదు.

రూ. 80 పెట్టి 90 కొనుక్కుని తాగానని, ఇంకో 90 జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్తున్నానని పోలీసుల ముందే ఆ పెద్దాయన చెప్పడం గమనార్హం. నేను ఎవరితో గొడవ పడలేదు.. ఏ మహిళను వేధించలేదు.. ఎలాంటి న్యూసెన్స్ సృష్టించలేదు.. కేవలం 90 తాగినంత మాత్రాన పోలీసులు నన్ను ఇలా వేధిస్తారా? అంటూ కొంచెం గట్టిగానే ప్రశ్నించాడు. అంతకు ముందే 90 తాగానని చెప్పిన పెద్దాయన.. మళ్లీ మళ్లీ అడిగేసరికి నేను తాగలేదు అని మాట మార్చడంతో అక్కడ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా నోర్రెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తాను 20 ఏళ్లుగా ఇక్కడే బహదూర్ పుర చౌరస్తా వద్ద ఉంటానని, రోడ్డు మీద ఎవరైనా చనిపోతే, లేదా మూసీలో అనాథ శవాలను ఎత్తివేయిస్తారని ఒక్క రూపాయి కూడా ఇవ్వరని అన్నాడు. పోలీసులు వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారని, తప్పేముందని అడిగితే వాళ్లు డ్యూటీ చేయట్లేదని పెద్దాయన తిరిగి ప్రశ్నించడం మరింత విచిత్రంగా తోస్తుంది. గుట్కా నమిలే అలవాటు ఉందా అని అడిగితే.. అలాంటి అలవాట్లు ఏమీ లేవని పెద్దాయన చెప్పుకొచ్చాడు. బ్రీత్‌నలైజర్ రీడింగ్ లో కూడా ఏమీ చూపించలేదని, కేవలం 90 మాత్రమే తాగి ఇంటికి వెళ్లి పడుకుంటానని చెప్తున్నాడు. అంత దాకా వస్తే మద్యం దుకాణాలు ఎందుకు తెరుస్తున్నారని, మూసివేయించాలని ధైర్యంగా చెప్పడం విశేషం. పోలీసులు తనను మర్యాద లేకుండా మాట్లాడుతున్నారని, ఇది సరికాదని రోడ్డుమీదనే నిలదీస్తూ ఆ పెద్దాయన అడగడం, సముదాయించినా ఒప్పుకోకపోవడం పోలీసులకే తలకు మించిన భారంగా తయారైంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..