ఇకపై ఈ పేపర్ లేకుండా నో పెట్రోల్, డీజిల్.. లేదంటే భారీ చలాన్ కట్టాల్సిందే..!
దేశ రాజధాని ఢిల్లీలో వాహన కాలుష్యం అరికట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. వాహనంలో పెట్రోల్ నింపడానికి ప్రభుత్వం PUC (కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్) తనిఖీని తప్పనిసరి చేసింది.
![ఇకపై ఈ పేపర్ లేకుండా నో పెట్రోల్, డీజిల్.. లేదంటే భారీ చలాన్ కట్టాల్సిందే..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/petrol-pumps.jpg?w=1280)
దేశ రాజధాని ఢిల్లీలో వాహన కాలుష్యం అరికట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. వాహనంలో పెట్రోల్ నింపడానికి ప్రభుత్వం PUC (కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్) తనిఖీని తప్పనిసరి చేసింది. మీరు పీయుసీ సర్టిఫికేట్ లేకుండా మీ వాహనంలో పెట్రోల్ నింపడానికి వెళితే, మీకు రూ. 10,000 చలాన్ విధించడం జరుగుతుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం 100 పెట్రోల్ పంపుల్లో పీయూసీ చెకింగ్ కోసం కెమెరాలు, సాఫ్ట్‌వేర్‌ను అమర్చేందుకు ఓ ప్రైవేట్ కంపెనీకి టెండర్ ఇచ్చింది. దీంతో నవగతి టెక్ కంపెనీ 15 రోజుల్లోగా తన సేవలను ప్రారంభించాల్సి ఉంది.
మన ఆరోగ్యాకి ప్రాణవాయువు ఎంతో ముఖ్యం. అయితే ప్రస్తుతం మన పీల్చుతున్న శ్వాసలో నాణ్యత ఉందా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. దేశ రాజధాని డిల్లీలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో కాలుష్యం పెరిగిపోయి స్కూల్స్‌కు సెలవు ప్రకటించడం, ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమనడం ద్వారా జనాలు బయటకు రాకుండా కట్టడి చేస్తున్నా సమస్యకు మాత్రం ఇది శాశ్వత పరిష్కారం కాదనే భావన సామాన్యుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ రవాణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెట్రోల్, డీజిల్ పోయించుకోవాలంటే పొల్యుషన్ సర్టిఫికేట్ తప్పనిసరి చేసింది. ఇందుకు సంబంధించి 15 రోజుల్లోగా పీయూసీ విచారణకు సిస్టం సిద్ధం చేయాలని కంపెనీని కోరామని, దీని ఖరీదు రూ.6 కోట్లు ఉంటుందని రవాణా శాఖ అధికారి చెబుతున్నారు.
ఈ పథకం ప్రకారం, పెట్రోల్ పంపులకు వచ్చే వాహనాలకు చెల్లుబాటు అయ్యే పియుసి లేకపోతే, కాలుష్యాన్ని తనిఖీ చేయడానికి కొన్ని గంటల సమయం ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యవధిలోపు పియుసి చేయకపోతే, రూ. 10,000 ఇ-చలాన్ తప్పనిసరిగా చెల్లించాల్సి వస్తుంది. పెట్రోల్ బంక్‌ల్లో అమర్చిన సీసీ కెమెరా ద్వారా ఆటోమేటిక్‌గా తీసివేయడం జరుగుతుంది. దాని గురించిన సమాచారం వాహన యజమాని మొబైల్‌కు పంపించేలా ఏర్పాటు చేసింది ఢిల్లీ రవాణా శాఖ.
కెమెరాను స్కాన్ చేయడం ద్వారా ప్రతిదీ కనుగొంటుంది. దీనితో పాటు, వాహనానికి చెల్లుబాటు అయ్యే పియుసి ఉందో లేదో తెలుసుకోవడానికి కెమెరాలు నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేస్తాయని రవాణా అధికారి చెబుతున్నారు. వాస్తవానికి, కార్బన్ మోనాక్సైడ్ (CO), కార్బన్ డయాక్సైడ్ (CO2) వంటి వివిధ కాలుష్య కారకాల ఉద్గార ప్రమాణాల కోసం వాహనాలు ఎప్పటికప్పుడు పరీక్షించడం జరుగుతుంది. ఆ తర్వాత వాటికి PUC సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. స్థానికంగా వాహనాలు పియుసీ లేకుండా వినియోగిస్తుండటంతో చాలా మంది పట్టుబడకుండా తప్పించుకుంటున్నారు. కానీ ఇప్పుడు పెట్రోల్ పంపుల్లో టెక్నాలజీని ఏర్పాటు చేయడంతో ఇకపై తప్పుంచుకోలేరంటున్నారు అధికారులు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..