AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dream: కలలో ఇవి కనిపిస్తే చాలా మంచివి.. మంచి టైమ్‌ స్టార్ట్ అయినట్లే..

నిద్రలో కలలు కనడం సర్వసాధారణం. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వచ్చే ఉంటాయి. అయితే మన ఆధీనంలో లేని కలలు మన జీవితాలను ప్రభావితం చేస్తాయని పండితులు చెబుతున్నారు. స్వప్న శాస్త్రంలో దీనికి సంబంధించి ఎన్నో అంశాలు ఉన్నాయి. అయితే కలలో మనకు వచ్చే కలలు కొన్ని మనకు నచ్చినవి అయితే, మరికొన్ని భయపెట్టేవి ఉంటాయి...

Dream: కలలో ఇవి కనిపిస్తే చాలా మంచివి.. మంచి టైమ్‌ స్టార్ట్ అయినట్లే..
Dream
Narender Vaitla
|

Updated on: Aug 10, 2024 | 6:41 PM

Share

నిద్రలో కలలు కనడం సర్వసాధారణం. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వచ్చే ఉంటాయి. అయితే మన ఆధీనంలో లేని కలలు మన జీవితాలను ప్రభావితం చేస్తాయని పండితులు చెబుతున్నారు. స్వప్న శాస్త్రంలో దీనికి సంబంధించి ఎన్నో అంశాలు ఉన్నాయి. అయితే కలలో మనకు వచ్చే కలలు కొన్ని మనకు నచ్చినవి అయితే, మరికొన్ని భయపెట్టేవి ఉంటాయి. అయితే కలలో వచ్చే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ మనకు వచ్చే కలలు ఏంటి.? వాటి అర్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* మీరు గుర్రపు స్వారీ చేస్తున్నట్లు కలలు కన్నట్లయితే మంచి సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఇది శాంతికి సంకేతమని స్వప్న శాస్త్రం చెబుతోంది. ఇక మీ ముఖాన్ని మీరు అద్దంలో చూసుకున్నట్లు కనిపించినా మంచికి అర్థం.

* కలలో దేవాలయాలు, విగ్రహాలు, భగవంతుని పూజించినట్లు కలలు వస్తే శుభసూచికమని నిపుణులు అంటున్నారు. త్వరలోనే మీ ఇంట్లో ఏదో శుభ కార్యం జరగబోతోందని అర్థం చేసుకోవాలి.

* కలలో ముద్దు పెడుతున్నట్లు కనిపించినా, పెళ్లి కానీ యువతి పురుషులను చూసినా మంచికి సంకేతంగా భావించాలి. ఇలా కనిపిస్తే మంచి జరగబోతోందని అర్థం చేసుకోవాలి.

* రాత్రి పడుకున్న సమయంలో కలలో గర్భిణీలు కనిపిస్తే చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. త్వరలోనే మీకు ఐశ్వర్యం వరించబోతోందని అర్థం చేసుకోవాలి. ఏదో రూపంలో సంపద రాబోతోందని అర్థం.

* నక్షత్రాలు భూమిపైకి రాలుతున్నట్లు కల వస్తే చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. ఇది మీకు భవిష్యత్తులో ఏదో అదృష్టం వరించబోతోందని అర్థం చేసుకోవాలని స్వప్నశాస్త్రంలో చెబుతున్నారు.

* అయితే మీకు ప్రమాదం జరిగినట్లు లేదా మరో వ్యక్తికి ప్రమాదం జరిగినట్లు కలవచ్చినా.. ఆయుధంతో కొట్లాడుతున్నట్లు కలలో కనిపించినా మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

* సూర్యాస్తమయం, కొండపై నుండి పడిపోతున్నట్లు కనిపిస్తే ఏదో సమస్య వచ్చే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. అనుకోని సమస్యలు వెంటాడబోతున్నాయని, జాగ్రత్తపడాల్సిన సమయమని అర్థం చేసుకోవాలి.

నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు, శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..