Hyderabad: బైక్‌పై లిఫ్ట్ ఇవ్వడమే అతను చేసిన పాపం.. మరి ఇంత మోసమా
వామ్మె సొసైటీలో మహా కేటుగాళ్లు తయారయ్యారు. ఎవరికైనా సాయం చేద్దామనుకోవడమే పాపంగా భావించే రోజులు తీసుకువస్తున్నారు. అప్రమత్తంగా లేకపోతే.. సర్వం సమర్పించుకోవాల్సిందే జాగ్రత్త.
స్కామ్, స్కీములకు ఇప్పుడు కొదవ లేదు. మనకు తెలియకుండానే క్షవరం చేసేస్తున్నారు కేటుగాళ్లు. సైబర్ నేరాలతోనే విసిగి వేసారుతుంటే.. ఇప్పుడు ఆఫ్ లైన్ క్రైమ్స్ కూడా బాగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తూ.. మరో వ్యక్తికి లిఫ్ట్ ఇవ్వడమే అతను చేసిన పాపమైంది. ఈ ఘటన కీసర పీఎస్ లిమిట్స్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌కు చెందిన భరత్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. బుధవారం నైట్ తన ద్విచక్రవాహనంపై నాగారం నుంచి ఉప్పల్‌కు ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి.. రాంపల్లి వరకు లిఫ్ట్ ఇవ్వాలని కోరడంతో సరేనని ఎక్కించుకున్నాడు. అలా వెళ్తుండగా రాంపల్లి సర్కిల్‌లో మరో వ్యక్తి వీరి బైక్‌ను ఆపాడు.
తాను పోలీస్‌నని చెప్పి.. బైక్ దిగాలని సూచించారు. ఎక్కడికి వెళ్తున్నారంటూ ఇద్దరినీ చెక్ చేశాడు. లిఫ్ట్ అడిగి ఎక్కిన వ్యక్తి తన వద్ద ఉన్న కవర్ ఇచ్చి, ఇద్దరం కలిసి గంజాయి సఫ్లై చేస్తామని ఫేక్ పోలీస్‌కు చెప్పాడు. దీంతో భరత్ కంగుతిన్నాడు. తనకు ఏ సంబంధం లేదని.. అతనికి జస్ట్ లిఫ్ట్ ఇచ్చానని చెప్పినా వినలేదు. గంజాయి కేసులో జైలుకు పంపుతానని… భరత్‌ను సదరు నకిలీ పోలీస్.. అతని దగ్గరి నుంచి రూ.26 వేలు లాక్కున్నాడు. అతని బైక్‌పైనే చిర్యాల బస్టాప్ వద్ద నిందితులిద్దరూ దిగి ఎస్కేప్ అయ్యారు. కొద్దిసేపటి తర్వాత మోసపోయాయని గ్రహించిన భరత్, గురువారం కీసర పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..