Telangana: ఓరి దేవుడా.. బండరాళ్ల కింద నలిగిన తల్లికూతుళ్ల బతుకులు!
సిద్దిపేట జిల్లా గోవర్ధనగిరిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనులు చేస్తుండగా కుప్పకూలిన బండరాళ్లు. బండరాళ్ల కింద పడి ఉపాథి కూలీలు తల్లీ కూతుళ్లు సమాధి అయ్యారు. మరో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింత చిక్కుకున్న వారిని స్థానికులు జేసీబీ సాయంతో రక్షించి ఆసుపత్రికి తరలించారు.

సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బతకడానికి కూలిపనులకు పోతే.. బతుకే లేకుండా పోయింది. బండరాళ్లు మీద పడి తల్లీకూతురు ప్రాణాలు కోల్పోయారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో విషాదం జరిగింది. ఉపాధి హామీ పనులు చేస్తుండగా బండరాళ్లు మీద పడి ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటుహుటీన సమీప ఆసుపత్రికి తరలించారు.
ఉపాధి హామీ పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా బండరాళ్లు మీద పడడంతో కందారపు సరోజన.. ఆమె కుమార్తె మమత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను జేసీబీ సాయంతో వెలికి తీశారు. ఒకే కుటుంబానికి చెందిన తల్లీకూతుళ్ల మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..