Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GHMC: రసాభాసగా మారిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం.. సభ నుంచి బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెండ్

జీహెచ్‌ఎంసీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం నుంచి రసాభాసగా మారాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య సభలో వాగ్వాదం జరిగింది. సభ ప్రారంభంకాగానే బడ్జెట్‌పై మాట్లాడాలని కోరారు మేయర్ విజయలక్ష్మి. అయితే ప్రశ్నోత్తరాల కోసం పట్టుబట్టిన బీఆర్‌ఎస్ సభ్యులు.. మేయర్‌కి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. పోడియం దగ్గరకు దూసుకెళ్లి.. మేయర్‌పైకి పేపర్లు చించివేశారు.

GHMC: రసాభాసగా మారిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం.. సభ నుంచి బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెండ్
Ghmc Meeting
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 30, 2025 | 4:00 PM

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. సభ ప్రారంభం కాగానే బడ్జెట్‌పై మాట్లాడాలని మేయర్ విజయలక్ష్మి కోరారు. అయితే ప్రశ్నోత్తరాల కోసం పట్టుబట్టిన బీఆర్‌ఎస్ సభ్యులు మేయర్‌కి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. పోడియం దగ్గరకు దూసుకెళ్లి.. పేపర్లు చించి మేయర్‌పైకి విసిరారు. వారిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్రయత్నించడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఆ గందరగోళం మధ్యే జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్‌‌ను ఆమోదిస్తున్నట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించారు.

బడ్జెట్ ఆమోదం తర్వాత ప్రశ్నోత్తరాలను మేయర్ ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల్లోనూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. మేయర్ పోడియంను చుట్టుముట్టి బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. బీఆర్‌ఎస్ సభ్యుల తీరుపై మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతకీ బీఆర్‌ఎస్ సభ్యులు అడ్డుపడటంతో జీహెచ్ఎంసీ సెక్షన్ 89/1 ప్రకారం బీఆర్‌ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. సభ నుంచి బయటకు పంపడంతో జీహెచ్‌ఎంసీ ఆఫీస్ ముందు బీఆర్‌ఎస్ ధర్నాకు దిగింది.

ప్రజల పక్షాన మాట్లాడితే సభ నుంచి బయటకు పంపుతారా.. అంటూ బీఆర్‌ఎస్ సభ్యులు నిలదీశారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన నడుస్తోందన్నారు ఎమ్మెల్యే వివేకానందగౌడ్. చర్చ జరగకుండా బడ్జెట్ ఆమోదించడం ప్రజాస్వామిక విధానం కాదన్నారు. సభను అడ్డుకోవాలనే లక్ష్యంతోనే బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు సమావేశానికి వచ్చారని అధికారపక్షం విమర్శిస్తోంది. సభలో అలా వ్యవహరించడం సరికాదని మండిపడుతున్నా కాంగ్రెస్ కార్పొరేటర్లు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యులు కావాలనే సభలో గందరగోళం సృష్టించారని అంటున్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. బడ్జెట్‌పై చర్చ జరగకుండా.. ఆ రెండు పార్టీలు కావాలనే గొడవ చేశాయని ఆయన అన్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..