AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు..

ఇక కళ్యాణోత్సవంలో ఉపయోగించే తలంబ్రాలను ఇంటికి తీసుకెళ్లేందుకు కూడా ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. వీటికోసమే భద్రాచలం వెళ్లే వారు కూడా ఉంటారు. అయితే ఇలాంటి వారి కోసమే తెలంగాణ ఆర్టీసీ ఓ శుభవార్త తెలిపింది. ఇంట్లోనే ఉండి భద్రాద్రి రామయ్య తలంబ్రాలను పొందే అవకాశాన్ని కల్పించింది. ప్రతీ ఏటా లాగే ఈసారి కూడా దేవదాయ ధర్మాదయా...

TSRTC: భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు..
Rama Navami
Narender Vaitla
|

Updated on: Apr 15, 2024 | 11:57 AM

Share

శ్రీరామనవమి వేడుకలకు ఆలయాలన్నీ సిద్ధమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రామాలయాల్లో వేడుకలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇక శ్రీరామనవి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారామచంద్రుల కళ్యాణోత్సవం ఎంతో వేడుకగా జరుగుతందన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ వేడుకను కనులారా చూసేందుకు భద్రాచలం వస్తుంటారు.

ఇక కళ్యాణోత్సవంలో ఉపయోగించే తలంబ్రాలను ఇంటికి తీసుకెళ్లేందుకు కూడా ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. వీటికోసమే భద్రాచలం వెళ్లే వారు కూడా ఉంటారు. అయితే ఇలాంటి వారి కోసమే తెలంగాణ ఆర్టీసీ ఓ శుభవార్త తెలిపింది. ఇంట్లోనే ఉండి భద్రాద్రి రామయ్య తలంబ్రాలను పొందే అవకాశాన్ని కల్పించింది. ప్రతీ ఏటా లాగే ఈసారి కూడా దేవదాయ ధర్మాదయా శాఖ సహకారంతో రాములోరి తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేర్చే కార్యక్రన్ని చేపట్టనున్నారు.

ఈ విషయమై తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. భద్రాచలంలో ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్బంగా జరిగే శ్రీ సీతారామచంద్రుల వారి కల్యాణ తలంబ్రాలను ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని తెలంగాణ ఆర్టీసీ కల్పించిందని తెలిపారు. ఇందుకోసం సంస్థ లాజిస్టిక్స్ విభాగ వైబ్ సైట్ http://tsrtclogistics.in సందర్శించి.. విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలను పొందండి అని సజ్జనార్‌ తెలిపారు.

ఆన్‌లైన్‌లో తలంబ్రాలను ఎలా బుక్‌ చేసుకోవాలో వివరిస్తున్న వీడియోను షేర్‌ చేశారు. అలాగే ఆఫ్‌లైన్‌లో కూడా తలంబ్రాలను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069ను సంప్రదించాలని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..