Telangana Govt: విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూల్స్, కాలేజీలకు సెలవు..!
శ్రీరాముడి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం శ్రీరామనవమికి సెలవు ప్రకటించింది. అధికారిక క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 17వ తేదీ బుధవారం సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్రకు నేతృత్వం వహిస్తున్నారు.
శ్రీరాముడి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం శ్రీరామనవమికి సెలవు ప్రకటించింది. అధికారిక క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 17వ తేదీ బుధవారం సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్రకు నేతృత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ ధూల్ పేట నుంచి మొదలయ్యే శోభాయాత్రకు నేతృత్వం వహించనున్నాడు రాజాసింగ్. ఇటీవల ఆయన యాత్ర కోసం సమావేశం ఏర్పాటు చేశారు. ధూల్ పేటలోని ఆకాశపురి హనుమాన్ ఆలయం నుంచి తలపెట్టిన భారీ ఊరేగింపును విజయవంతం చేసేందుకు స్వచ్ఛంద సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
కాగా శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆరోజు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలే కాకుండా విద్యాసంస్థలు పూర్తిగా బంద్ అవుతాయి. ఈ సెలవుదినాన్ని సాధారణ సెలవుదినంగా పేరొంది. కాగా హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకుని నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. అయితే రాజాసింగ్ యాత్ర సందర్భంగా పోలీసులు ఆయా మార్గాల్లో అలర్ట్ కానున్నారు.
అయితే ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పక్షం తొమ్మిదవ రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న శ్రీరామనవమి జరుపుకోనున్నారు. హిందూ విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు ఈ పవిత్రమైన రోజున జన్మించాడు. కాబట్టి, దేశం మొత్తం శ్రీరామనవమిని అత్యంత వైభవంగా జరుపుకుంటుంది. దాదాపు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు తన జన్మస్థలానికి తిరిగి రావడంతో అయోధ్యలో రాబోయే పండుగకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకుని శ్రీరామ జన్మభూమి మందిరంలో శ్రీరాముడి దర్శనం పొందుతారని అంచనా. దీంతో అయోధ్య ట్రస్టు నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.