AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: సంప్రదాయపద్దతిలో శునకానికి అంత్యక్రియలు.. వీడియో వైరల్..

విశ్వాసంలో శునకానికి మించిన జంతువు మరొకటి లేదు. చాలామంది పెంపుడు కుక్కలను తమ కుటుంబ సభ్యుల మాదిరిగా అల్లారు ముద్దుగా చూసుకుంటారు. వాటితో అనుబంధాన్నిపెంచుకుంటారు. వాటికి ఏచిన్న హాని కలిగినా తల్లడిల్లిపోతారు. ఆ మూగ జీవులు కూడా తమ యజమాని పట్ల అదే ప్రేమ, విశ్వాసం కలిగి ఉంటాయి. యజమాని కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడతాయి.

Watch Video: సంప్రదాయపద్దతిలో శునకానికి అంత్యక్రియలు.. వీడియో వైరల్..
Traditional Funeral For Dog
M Revan Reddy
| Edited By: Srikar T|

Updated on: Apr 15, 2024 | 12:58 PM

Share

విశ్వాసంలో శునకానికి మించిన జంతువు మరొకటి లేదు. చాలామంది పెంపుడు కుక్కలను తమ కుటుంబ సభ్యుల మాదిరిగా అల్లారు ముద్దుగా చూసుకుంటారు. వాటితో అనుబంధాన్నిపెంచుకుంటారు. వాటికి ఏచిన్న హాని కలిగినా తల్లడిల్లిపోతారు. ఆ మూగ జీవులు కూడా తమ యజమాని పట్ల అదే ప్రేమ, విశ్వాసం కలిగి ఉంటాయి. యజమాని కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడతాయి. పెంచుకున్న శునకం చనిపోవడంతో సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వహించి దానిపై ఉన్న మమకారాన్ని చాటుకున్నాడు ఓ జంతు ప్రేమికుడు.

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని నయానగర్‌కు చెందిన భూసాని మల్లారెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు పిల్లలు లేరు. పిల్లలు లేని లోటుతో ఈ దంపతులు మానసికంగా కుంగిపోయారు. దీంతో వారు పదిహేనేళ్ల క్రితం ఓ శునకాన్ని తెచ్చుకొని స్వీటి అని పేరు కూడా పెట్టుకున్నారు. ఆ శునకాన్ని చిన్న పిల్లల మాదిరిగా అల్లారు ముద్దుగా పెంచారు. ఆ శునకం కూడా వారికి కుటుంబ సభ్యుడిగా మారిపోయింది. ఆ శునకానికి ప్రతి ఏటా బంధు మిత్రుల మధ్య బర్త్ డే వేడుకలను నిర్వహించేవారు.

15ఏళ్లుగా కుటుంబసభ్యుడిలా పెంచుకున్న శునకం మృతిచెందడంతో ఆ దంపతులు తట్టుకోలేక పోయారు. మనుషులు చనిపోతే చేసే విధంగానే ఆ శునకానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ శునకాన్ని ఇంటి ముందు ఉంచి.. పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్యాండ్‌ మేళాన్ని ఏర్పాటు చేసి వాహనంలో కోదాడ శివారులోని తన వ్యవసాయ పొలానికి తీసుకెళ్ళి ఆ దంపతులు శాస్త్రోక్తంగా ఖననం చేశారు. స్థానికులు, బంధువులను పిలిచి ఆ శునకానికి చిన్న, పెద్ద కర్మ కాండలు కూడా నిర్వహించారు. కుటుంబ సభ్యుడిగా పెంచుకున్న ఆ శునకం.. తమకు పిల్లలు లేనిలోటు తీర్చిందని మల్లారెడ్డి, ఈశ్వరమ్మ దంపతులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..