Telangana LS Polls: తెలంగాణలో బీజేపీ గెలిచే స్థానాలు ఎన్నంటే..? కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana LS Polls: తెలంగాణలో బీజేపీ గెలిచే స్థానాలు ఎన్నంటే..? కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Janardhan Veluru

|

Updated on: Apr 15, 2024 | 11:26 AM

సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని హిమాయత్‌నగర్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఎన్డీయే కూటమి దేశంలో 400 సీట్లు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తామని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేడని, ఆ పార్టీకి ఓటు వేయడం వృధా అన్నారు.

సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని హిమాయత్‌నగర్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఎన్డీయే కూటమి దేశంలో 400 సీట్లు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తామని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేడని, ఆ పార్టీకి ఓటు వేయడం వృధా అన్నారు. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మురికిలో వేసినట్టే అన్నారు. BRS, కాంగ్రెస్ పార్టీలు వచ్చిన సచ్చిన పోయేదేం లేదన్నారు. నేటి నుంచి దేశ వ్యాప్తంగా ఇంటింటికి బీజేపీ ప్రచారం స్టార్ట్ చేశామని తెలిపారు. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించాం.. ప్రచారాన్ని స్టార్ట్ చేశామన్నారు. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన మోడీ నినాదాలే వినిపిస్తున్నాయని అన్నారు.

సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్రాధ్యక్షుడైన కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ బరిలో ఉన్నారు.