AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్రాంతి పండుగ వేళ మహిళలకు TSRTC గుడ్ న్యూస్.. ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం..

సంక్రాంతి పండుగ వేళ మహిళలకు TSRTC గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం అమలవుతుందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం స్పష్టంచేశారు. సంక్రాంతి స్పెషల్ బస్సులపై సజ్జనార్ టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. సంక్రాంతి పండుగ వేళ నడిపే స్పెషల్ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవంటూ పేర్కొన్నారు.

సంక్రాంతి పండుగ వేళ మహిళలకు TSRTC గుడ్ న్యూస్.. ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం..
Tsrtc
Shaik Madar Saheb
|

Updated on: Jan 06, 2024 | 5:06 PM

Share

సంక్రాంతి పండుగ వేళ మహిళలకు TSRTC గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం అమలవుతుందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం స్పష్టంచేశారు. సంక్రాంతి స్పెషల్ బస్సులపై సజ్జనార్ టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. సంక్రాంతి పండుగ వేళ నడిపే స్పెషల్ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా సంక్రాంతికి నడిపే ప్రత్యేక బస్సుల్లో మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కిం అమలు అవుతుందని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ నుంచి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గతంతో పోల్చితే 10శాతం బస్సులను పెంచామని.. మొత్తం 4484 బస్సులు నడపనున్నట్లు తెలిపారు. తెలంగాణలో డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి అవసరాన్ని బట్టి బస్సుల సంఖ్య పెంచుతామని సజ్జనార్ తెలిపారు. సంక్రాంతికి ఏపికి వెళ్లాల్సిన షెడ్యూల్ బస్సులు నడుస్తాయని తెలిపారు.

ఫ్రీ బస్ స్కీమ్‌తో తెలంగాణలో పుణ్యక్షేత్రాలకు తాకిడి పెరిగినట్లు సజ్జనార్ తెలిపారు. పుణ్యక్షేత్రాలకు, పర్యాటక స్థలాలకు రిజర్వేషన్లు పెరుగుతున్నాయన్నారు. ఈసారి ఇతర రాష్ట్రాలకు పొంగల్ స్పెషల్ సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ తగ్గించినట్లు తెలిపారు. తెలంగాణలో డిమాండ్‌ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అవసరమైతే తెలంగాణ వరకు మరిన్ని సర్వీసులు పెంచే ఆలోచనలో టీఎస్‌ఆర్టీసీ ఉందని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ సిబ్బందికి సహకరించి సురక్షిత ప్రయాణం చేయాలని.. ప్రైవేట్ వాహనాలను సంప్రదించవద్దంటూ సజ్జనార్ వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బెస్ట్‌ మైలేజీ..!
భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బెస్ట్‌ మైలేజీ..!
ఐపీఎల్ హిస్టరీలో భారీ జరిమానా.. అయ్యర్ పరిస్థితి అగమ్యగోచరం
ఐపీఎల్ హిస్టరీలో భారీ జరిమానా.. అయ్యర్ పరిస్థితి అగమ్యగోచరం
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
లోపల గ్యాస్ ఎంత ఉందో బయటి నుంచే కనిపించే సిలిండర్లు వచ్చేశాయ్..
లోపల గ్యాస్ ఎంత ఉందో బయటి నుంచే కనిపించే సిలిండర్లు వచ్చేశాయ్..
ప్రపంచ దేశాలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఒపెన్ కానున్న హర్మూజ్!
ప్రపంచ దేశాలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఒపెన్ కానున్న హర్మూజ్!
రణబాలి మూవీ అనంతపూర్ షెడ్యూల్ కంప్లీట్..
రణబాలి మూవీ అనంతపూర్ షెడ్యూల్ కంప్లీట్..
పాల మీగడతో అసలైన ఆవు నెయ్యిను ఈజీగా ఎలా తయారు చేయొచ్చో తెల్సా..
పాల మీగడతో అసలైన ఆవు నెయ్యిను ఈజీగా ఎలా తయారు చేయొచ్చో తెల్సా..
హత్య చేసి ఇంట్లో పాతి పెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ!
హత్య చేసి ఇంట్లో పాతి పెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ!
వాహనదారులకు షాక్‌.. పెరిగిన సీఎన్‌జీ ధరలు.. కేజీకి ఎంతంటే..
వాహనదారులకు షాక్‌.. పెరిగిన సీఎన్‌జీ ధరలు.. కేజీకి ఎంతంటే..
కెప్టెన్లను కాదని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టేసిన కుర్రాడు
కెప్టెన్లను కాదని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టేసిన కుర్రాడు