Ram Nath Kovind: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో మాజీ మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు భేటీ
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ కలుసుకున్నారు. రాజ్ భవన్‌లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం ఇచ్చి.. శాలువ కప్పి సత్కరించారు. వీరిద్దరు కాసేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు.

హైదరాబాద్ పర్యటనలో ఉన్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఘన స్వాగతం లభించింది. భాగ్యనగరంలో బిజీ బిజీగా గడిపిన ఆయన పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. శనివారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన రామ్‌నాథ్ కోవింద్, అనంతరం పలువురితో సమావేశమయ్యారు. ఈక్రమంలోనే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ కలుసుకున్నారు. రాజ్ భవన్‌లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం ఇచ్చి.. శాలువ కప్పి సత్కరించారు. వీరిద్దరు కాసేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు.
కాగా, జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన రామ్‌నాథ్ కోవింద్‌ను చెన్నమనేని విద్యాసాగర్ రావు సమావేశమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వీరిరువురు కలిసి రాజ్‌భవన్‌లోనే విందు ఆరగించారు. ఇక్కడ వీడియో చూడండిః
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..