Siddipet Municipality: సిద్దిపేట మున్సిపాలిటీకి జాతీయస్థాయి అవార్డ్.. స్వచ్చ్ సర్వేక్షన్ లో అగ్రస్థానం
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్దో సిద్దిపేట పట్టణం జాతీయ స్థాయిలో మరోసారి మెరిసింది. ప్రతి ఏటా ప్రకటించే స్వచ్ సర్వేక్షన్ అవార్డు ల్లో జాతీయ స్థాయి లో సిద్దిపేట పట్టణానికి అవార్డు లభించింది. చెత్త సేకరణ సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా తడి, పొడి, హానికర చెత్తలను వేరు చేయడం, పారిశుధ్య నిర్వహణపై ప్రజల్లో చైతన్యం తేవడంలో విజయవంతమైంది.

స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్దో సిద్దిపేట పట్టణం జాతీయ స్థాయిలో మరోసారి మెరిసింది. ప్రతి ఏటా ప్రకటించే స్వచ్ సర్వేక్షన్ అవార్డు ల్లో జాతీయ స్థాయి లో సిద్దిపేట పట్టణానికి అవార్డు లభించింది. చెత్త సేకరణ సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా తడి, పొడి, హానికర చెత్తలను వేరు చేయడం, పారిశుధ్య నిర్వహణపై ప్రజల్లో చైతన్యం తేవడంలో విజయవంతమైంది. ముఖ్యంగా సిద్దిపేట పట్టణంలో సిటీజన్స్ ఫీడ్ బ్యాక్ లో అగ్రస్థానంలో నిలవడంతో జాతీయ స్థాయి లో అవార్డు వరించింది.
నిత్య పర్యవేక్షణ, తడిపొడి చెత్తను వేరు చేద్దాం అని ప్రజల్లో చైతన్యం తెచ్చిన మున్సిపల్ కౌన్సిలర్స్, అధికారుల, సిబ్బంది పని తీరు కారణంగా దేశంలో జాతీయ స్థాయిలో నిలిచింది గ్రేటర్ హైదరాబాద్. అలాగే జాతీయ స్థాయి జోనల్ విభాగంలో లక్షకు పైగా జనాభా ఉన్న సిద్దిపేట పట్టణం స్వచ్చ్ సర్వేక్షన్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రజల సహకారం, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే సాధ్యం అయ్యింది అన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అవార్డు ప్రకటించారు అంటే సిద్దిపేట పేరు లేకుండా అవార్డు అంటూ ఉండదు. అందుకు నిదర్శనం నేడు ప్రకటించిన అవార్డు నే అని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
సిద్దిపేట ప్రజలు చెత్త సేకరణలో, ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చడంలో, పారిశుధ్య నిర్వహణలో వారి భాగస్వామ్యం తోనే సిద్దిపేట పేరు ఎల్లలు దాటుతోంది. ప్రజల సహకారం గొప్పది. ప్రజల్లో చైతన్యం తేవడంలో ప్రజాప్రతినిధులు చూపించే చొరవ, మున్సిపల్ అధికారులు, సిద్దిపేట పని తీరు కు దక్కిన అవార్డు అని ఈ సందర్బంగా హరీష్ రావు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తి తో మరిన్ని అవార్డు లు సాధించేలా కృషి చేయాలన్నారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…