MLA Jaiveer Reddy: జనంలో మనంగా శాసనసభ్యులు.. తన వాహనాలకు ఎమ్మెల్యే స్టిక్కర్లను తొలగించిన జైవీర్ రెడ్డి
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తనకు ఎస్కార్ట్ వద్దంటూ డీజీపీకి రిటర్న్ చేస్తూ లేఖ అందించారు. తనకు సెక్యూరిటీ గా ఉండే పోలీసులను ప్రజా సేవకు వినియోగించాలని కోరారు. తాజాగా నాగార్జున సాగర్ శాసనసభ్యుడు జైవీర్ రెడ్డి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వాహనాలకు ఎమ్మెల్యే స్టిక్కర్లను తొలగించారు.

శాసనసభ్యులుగా ఎన్నిక కావడం అంటే ఆషామాషీ కాదు.. ఎమ్మెల్యే అంటేనే అధికారం, దర్పం వేరు. కానీ కొత్తగా శాసన సభకు ఎన్నికైన ఎమ్మెల్యేలు తమదైన పంథాలో కొత్త ఒరవడికి శ్రీకారం చూడుతున్నారు. అందులో ఒకరు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అయితే, మరొకరు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. గత వారం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తనకు ఎస్కార్ట్ వద్దంటూ డీజీపీకి రిటర్న్ చేస్తూ లేఖ అందించారు. తనకు సెక్యూరిటీ గా ఉండే పోలీసులను ప్రజా సేవకు వినియోగించాలని కోరారు. తాజాగా నాగార్జున సాగర్ శాసనసభ్యుడు జైవీర్ రెడ్డి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వాహనాలకు ఎమ్మెల్యే స్టిక్కర్లను తొలగించారు. తనకు కేటాయించిన మూడు ఎమ్మెల్యే స్టిక్కర్లు దుర్వినియోగం కాకుండా తిరిగి శాసనసభ అధికారులకు అప్పగించే యోచనలో ఉన్నారు.
ఎమ్మెల్యే స్టిక్కర్ ను తొలగించిన ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి..తాను ప్రయాణించే ప్రతి వాహనానికి ఫాస్ట్ టాగ్ ఏర్పాటు చేసుకున్నారు. టోల్ ప్లాజా వద్ద సామాన్య వాహనదారుల వలే.. వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. తన వెంట వచ్చే సిబ్బంది, అనుచరులను కూడా సాధారణ లైన్‌లో వెళ్లాలని ఆదేశించారు. తన కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పేరుతో సామాన్య ప్రజలను ఎక్కడ ఇబ్బంది పెట్టొద్దు అంటూ ఇప్పటికే జైవీర్ పోలీసులను ఆదేశించారు.
స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కాన్వాయ్ పరిమాణాన్ని 15 వాహనాల నుంచి తొమ్మిది వాహనాలకు తగ్గించారు. తాను ప్రయాణించే రూట్లలో ట్రాఫిక్ నిలిచిపోకుండా చూడాలని, తన కాన్వాయ్ వల్ల ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని మరికొందరు ఎమ్మెల్యేలు ఆయన బాటలోనే పయనించేందుకు సిద్ధమవుతున్నారు. నూతన ఎమ్మెల్యేలు కొత్త ఒరవడికి శ్రీకారం చూడుతుండడం పట్ల జనం హార్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…