AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: ప్రయాణికులపై ఆర్టీసీ మరో పిడుగు.. ఆ ఛార్జీలు పెంపు.. ఏప్రిల్ నుంచి అమలులోకి

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలపై ఆర్టీసీ (RTC) పిడుగు పడింది. డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అన్నిరకాల బస్‌పాస్‌ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు..

TSRTC: ప్రయాణికులపై ఆర్టీసీ మరో పిడుగు.. ఆ ఛార్జీలు పెంపు.. ఏప్రిల్ నుంచి అమలులోకి
Rtc Hike
Ganesh Mudavath
|

Updated on: Mar 25, 2022 | 7:43 AM

Share

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలపై ఆర్టీసీ (RTC) పిడుగు పడింది. డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అన్నిరకాల బస్‌పాస్‌ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు (Charges) ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. జనరల్‌ బస్‌ టికెట్‌ పాసుల కేటగిరిలో ఆర్డినరీ పాస్‌ (Ordinary Pass) చార్జీ రూ.950 నుంచి రూ.1150కి, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.1,070 నుంచి రూ.1,300కు, మెట్రో డీలక్స్‌ రూ.1,185 నుంచి రూ.1,450కి, మెట్రో లగ్జరీ రూ.2 వేల నుంచి రూ.2,400కు, పుష్పక్‌ పాస్‌ రూ.2,500 నుంచి రూ.3 వేలకు పెంచుతూ ఆర్టీసీ అధికారులు వివరాలు వెల్లడించారు. ఎన్‌జీఓ బస్‌పాస్‌లకు సంబంధించి ఆర్డినరీ పాస్‌ ఛార్జీ రూ.320 నుంచి రూ.400కు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.450 నుంచి రూ.550కి, మెట్రో డీలక్స్‌ రూ.575 నుంచి రూ.700కు, ఎంఎంటీఎస్‌–ఆర్టీసీ కోంబో టికెట్‌ ఛార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెరిగింది.

ఇటీవలే సేఫ్టీ సెస్‌ పేరుతో టికెట్‌పై రూపాయి పెంచి, చిల్లర సమస్య రాకుండా ధరను రౌండాఫ్‌ చేయటంతో గరిష్టంగా టికెట్‌ ధర రూ.5 మేర పెరిగింది. గతంలో రౌండాఫ్‌ ధర కాస్త ఎక్కువగా ఉందన్న ఫిర్యాదుతో దాన్ని తగ్గించిన ఆర్టీసీ మళ్లీ పాత ధరలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. కరోనా లాక్‌డౌన్, ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఎండీ సజ్జనార్ తన మార్క్ వేలో ముందకు వెళ్తున్నారు. ఓవైపు ఆఫర్లు, ఫ్యాకేజీలతో ప్రయాణికులను ఆకర్షిస్తూ.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. టీఎస్‌ఆర్టీసీ ముందుకు తీసుకెళ్తే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read

Petrol Price Today: మంట పుట్టిస్తున్న ఇంధన ధరలు.. ఒకరోజు గ్యాప్‌ తర్వాత పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ రేట్స్‌..

Yadadri: టీటీడీ తరహాలో యాదాద్రికి ప్రత్యేక బోర్డు.. పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ప్రభుత్వం అడుగులు

Viral Photos: కళ్లను మాయ చేసే చిత్రాలు.. నెట్టింట వైరల్.. చూస్తే షాకే!