TSRTC: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. దసరా పండుగకు 4,045 ప్రత్యేక బస్సులు..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Oct 05, 2021 | 11:09 AM

TSRTC: దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..

TSRTC: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. దసరా పండుగకు 4,045 ప్రత్యేక బస్సులు..
Tsrtc

TSRTC: దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేసింది. దసరా పండుగ నేపథ్యంలో ఈనెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ ఆ ప్రకటనలో పేర్కొంది. పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 4,045 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. వీటిలో 3,085 బస్సులను తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నడుపుతుండగా.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రద్దీని బట్టి 950 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించారు. కాగా, మొన్నటి వరకు సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్న సజ్జనార్.. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక మార్పులకు శ్రీకారం చుడుతూ వస్తున్నారు. ఆర్టీసీ డెవలప్‌మెంట్ కోసం కార్యాచరణ చేపడుతున్నారు.

ఇదిలాఉంటే.. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి(6వ తేదీ) ఈ నెల 17వ తేదీ వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. ఈనెల 18వ తేదీన తిరిగి పాఠశాలలుు పునఃప్రారంభం అవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది.

Also read:

Zodiac Signs: ఇతరులతో ఇట్టే కలిసిపోతారు.. ఈ నాలుగు రాశుల వారి ప్రత్యేకతే వేరు..

Child Parenting Tips: ఈ 5 విషయాలు మీ పిల్లలకు ఎప్పుడూ చెప్పకూడదు.. ఎందుకో తెలుసా?..

Cyber Crime: మళ్లీ రెచ్చిపోయిన మాయగాళ్లు.. సోషల్ మీడియా వేదికగా వృద్ధురాలిని నిలువు దోపిడీ చేశారు..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu