Child Parenting Tips: ఈ 5 విషయాలు మీ పిల్లలకు ఎప్పుడూ చెప్పకూడదు.. ఎందుకో తెలుసా?..
Child Parenting Tips: ‘మొక్కై వంగనిది మానై వంగునా’ అనే నానుడి అందరికీ తెలిసిందే. ఇది నానుడి పిల్లల విషయంలో పక్కా వర్తిస్తుంది.
Child Parenting Tips: ‘మొక్కై వంగనిది మానై వంగునా’ అనే నానుడి అందరికీ తెలిసిందే. ఇది నానుడి పిల్లల విషయంలో పక్కా వర్తిస్తుంది. పిల్లలు సహజంగానే.. తమ తల్లిదండ్రులను అనుసరిస్తుంటారు. వారు మాట్లాడే భాష, నడవడికను ఇట్టే గ్రహిస్తారు. అందుకే పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. లేదంటే వారు.. చెడు మార్గంలో పయనించే ప్రమాదం ఉంది. అందుకే.. వారితో మాట్లాడే సమయంలో, వారి ముందు ప్రవర్తన కూడా మంచిగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే వారిపై చెడు ప్రభావం పడి.. జీవితంలో చెడుదారిలో పయనించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పిల్లలను పెంచే క్రమంలో ఈ ఐదు అంశాలతో వారితో అస్సలు చెప్పకూడదని నిపుణులు చెబుతున్నారు. వాటిని చెప్పకుండా ఉండటం వల్ల.. పిల్లలు మంచి మార్గంలో పెద్దఅవుతారని చెబుతున్నారు. మరి ఆ ఐదు ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. డబ్బుకు సంబంధించి పిల్లల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు డబ్బు విలువ తెలియజేయాలి. కష్టపడి సంపాదించిన డబ్బు ఎంత విలువైందో వారికి తెలియజేయాలి. కలలను, ఆనందాన్ని డబ్బు ద్వారా పొందలేమని అర్థం చేసుకునేలా చేయాలి. అలా.. పిల్లలు తెలివైన ఆర్థిక అలవాట్లను పెంపొందించుకునేలా చేయాలి. భౌతికవాదం కంటే సంతోషానికి ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలి.
2. పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రేమ బేషరతుగా ఉండాలి. మీరు చేసే ప్రతి పని వారి పట్ల ప్రేమతో చేసినట్లుగా ఉండాలి. ఏదో మొక్కుబడిగా, ఉద్దేశ్యపూర్వకంగా చేసినదై ఉండకూదడు. అయితే, మీ కోసం ఏదైనా చేస్తామనే ఉద్దేశం వారిలో కల్పించకూడదు. ఎందుకంటే.. అలాంటి భావన వారిలో వస్తే వారి మార్గం తప్పుదోవపట్టే ప్రమాదం ఉంది. తప్పుచేస్తే ఉపేక్షించరనే భావన కూడా వారిలో తీసుకురావాలి.
3. పిల్లలు.. చిన్నపిల్లల్లా ప్రవ్తించినా పర్వాలేదు. వారు తప్పులు చేసినా పర్వాలేదు. పిల్లలు మారం చేయడం సహజం అని లైట్ తీసుకోవద్దు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల కొన్నిసార్లు కఠినంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. క్రమశిక్షణగా ఉండేందుకు.. కొన్నిసార్లు కఠినంగా ఉండటం మంచిది. ఈ విధానం పిల్లలను చురుకైన, సంప్రదాయవాదిగా పెరిగేందుకు ఉపకరిస్తుంది.
4. మీరు అసమర్థులు అని ఎప్పుడూ అనకండి. ఆ మాట పదే పదే అనడం వలన.. పిల్లలు నిజంగానే అసమర్థులుగా మారే ప్రమాదం ఉంది. ఆ మాటలుు పిల్లల్లోని ప్రతిభను మసకబారుస్తుంది. అందుకే వారిని నిరాశపరిచే మాటలు కాకుండా.. ఉత్తేజపరిచే మాటలు చెప్పాలి. జీవితంలో ముందుకు సాగడానికి, ఉన్నత శిఖరాలను అందుకోవడానికి వారిని ప్రోత్సహించాలి.
5. జీవిత భాగస్వామి గురించి పిల్లల ముందు ఎప్పుడూ చెడుగా చెప్పొద్దు. తల్లిదండ్రులు.. ముఖ్యమైన వ్యక్తులతో ఎలా నడుచుకోవాలో తమ పిల్లలకు తెలియజేయాలి. పిల్లల ముందు గొడవ పడకుండా.. జీవిత భాగస్వామితో కఠినంగా మాట్లాడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. పిల్లలను ఎప్పుడూ ప్రేమగా పెంచాలి.