Viral Video: టబ్‌ను చూసి హర్టయిన గొర్రె.. ఏం చేసిందో చూస్తే నవ్వకుండా ఉండలేరు..! వైరలవుతోన్న వీడియో
Trending Video: సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు తెగ వైరలవుతుంటాయి. తాజాగా ఓ గొర్రె వీడియో కూడా నెట్టింట్లో సందడి చేస్తోంది.
Trending Video: జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటాయి. ఎన్నో అద్భుతమైన, చూసేందుకు సరదాగా ఉండే అనేక వీడియోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. ఎందుకుంటే వాటి ప్రపంచం మానవ ప్రపంచానికి పూర్తిగా భిన్నమైంది. అందుకే ఈ వీడియోలను ఎక్కువమంది ఇష్టపడుతుంటారు. జంతువులకు కూడా భావోద్వేగాలు ఉంటాయన్నది తెలిసిందే. అవి కూడా సంతోషం, బాధను కలిగి ఉంటాయి. సరదాగా ఉన్నప్పడు గెంతులేస్తాయి. బాధలో ఉన్నప్పుడు పోరాడతాయి. తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వైరల్ అవుతున్న ఓ గెర్రె వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
ఈ వీడియోలో ఒక గొర్రె పొలిమేరలో నిలబడి ఉండటం, దాని ముందు ఒక టబ్ ఉండడం చూడొచ్చు. అయితే టబ్‌ను చూసిన గొర్రె కొంచెం వెనక్కు వెళ్లి.. అమాతం ఎంతో వేగంతో వచ్చి టబ్‌ను ఢీకొట్టింది. దీంతో దాని తల టబ్‌లో ఇరుక్కపోయి బోర్లా పడుతుంది. అయినా ఈ గెర్రె కోపం ఇంకా తగ్గనట్లుగా ఉండడంతో మరోసారి దానిని ఢీకొట్టేందుకు సిద్ధమవడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.
గొర్రెకు సంబంధించిన ఈ వీడియోను అందరూ ఎంతో ఇష్టపడుతున్నారు. ఈ వీడియో 1600పైగా వ్యూస్‌తో నెట్టింట్లో దూసుకెళ్తుంది. అలాగే వీడియోకు వేల లైకులు వస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోని పరిమల్ నత్వాని అనే వ్యక్తి షేర్ చేశాడు. ఈ వీడియోపై చాలా రియాక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి.
‘ఈ గొర్రె ఎంత ముద్దుగా ఉంది’ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, ‘ఇది అథ్లెటిక్ గొర్రె’ కావొచ్చు అని మరోక యూజర్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఇలా సరదాగా యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.
That is one athletic sheep! #ViralVideo #ViralVideos pic.twitter.com/M5lXhNSYUi
— Parimal Nathwani (@mpparimal) September 30, 2021
Also Read: Viral Video: ఈ సీన్ చూశారా మాస్టారూ..! సింహం టాయిలెట్ యూజ్ చేస్తోంది
Yuvraj Singh: లైగర్‌తో తలపడ్డ యువరాజ్ సింగ్.. టగ్ ఆఫ్ వార్‌లో విజేత ఎవరంటే..? వైరలవుతోన్న వీడియో