Nirmal : సర్పంచ్‌ను చెప్పుతో కొట్టిన ఉప సర్పంచ్‌.. వైరల్ వీడియో

Nirmal : సర్పంచ్‌ను చెప్పుతో కొట్టిన ఉప సర్పంచ్‌.. వైరల్ వీడియో

Phani CH

|

Updated on: Oct 05, 2021 | 9:10 AM

నిర్మల్‌ జిల్లా భైంసా మండలం మహాగామ్‌ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మహాగామ్ గ్రామ సర్పంచ్ అప్పల రాకేష్ పై ఉప సర్పంచ్ శారదా చెప్పుతో దాడి చేయడంతో రెండు వర్గాల నడుమ ఘర్షణ తలెత్తింది.

నిర్మల్‌ జిల్లా భైంసా మండలం మహాగామ్‌ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మహాగామ్ గ్రామ సర్పంచ్ అప్పల రాకేష్ పై ఉప సర్పంచ్ శారదా చెప్పుతో దాడి చేయడంతో రెండు వర్గాల నడుమ ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాల కార్యకర్తలు బాహాబాహికి దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి రెండు వర్గాల వారిని చెదరగొట్టారు.. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా గ్రామ పంచాయతీ నిధుల విషయంలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌కు మధ్య విభేదాలు ఉన్నాయి. నిధుల దుర్వినియోగంపై ఉప సర్పంచ్‌ శారదా కలెక్టర్‌ కు కూడా ఫిర్యాదు చేసింది..దీంతో డీఎల్‌పీవో శివరామకృష్ణ విచారిస్తుండగా, సర్పంచ్‌ రాకేష్‌ పై అక్కడ వీడియోలు తీస్తున్న సెక్రటరీ ప్రత్యూషపై కూడా శారదా దాడి చేసింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Karimnagar: కెనాల్‌లో పడ్డ ఆవు.. ప్రాణాలకు తెగించి కాపాడిన స్థానికులు.. వీడియో

ఆ సన్నివేశాలకు కట్స్‌ లేకుండా..!! థియేటర్లకు జేమ్స్‌.. వీడియో