AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yuvraj Singh: లైగర్‌తో తలపడ్డ యువరాజ్ సింగ్.. టగ్ ఆఫ్‌ వార్‌లో విజేత ఎవరంటే..? వైరలవుతోన్న వీడియో

అయితే తాజాగా మరో పోరాటంతో వార్తల్లో నిలిచాడు. ఏకంగా లైగర్‌తో టగ్ ఆఫ్ వార్‌లో పోటీ పడుతూ నెట్టింట్లో సందడి చేస్తున్నాడు.

Yuvraj Singh: లైగర్‌తో తలపడ్డ యువరాజ్ సింగ్.. టగ్ ఆఫ్‌ వార్‌లో విజేత ఎవరంటే..? వైరలవుతోన్న వీడియో
Yuvraj Singh
Venkata Chari
|

Updated on: Oct 04, 2021 | 11:49 AM

Share

Yuvraj Singh: భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ క్రికెట్‌లో అత్యంత విధ్వంసక ఆటగాళ్లలో ఒకరిగా పేరుగాంచాడు. క్రికెట్ అనంతరం సౌత్‌పా వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. భారీ సిక్సర్లను అవలీలగా కొట్టే తీరుకు ఫిదా కాని వారుండరు. అయితే తాజాగా మరో పోరాటంతో వార్తల్లో నిలిచాడు. ఏకంగా లైగర్‌తో టగ్ ఆఫ్ వార్‌లో పోటీ పడుతూ నెట్టింట్లో సందడి చేస్తున్నాడు. సౌత్‌పా ఆదివారం (అక్టోబర్ 3) ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన ఓ వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. తన సాహసోపేతమైన పోరాటాన్ని అభిమానులతో పంచుకున్నాడు. దుబాయ్‌లోని ఫేమ్ పార్క్‌లో జంతువులతో తన స్నేహితులతో సరదాగా గడిపిన ఓ వీడియోను పంచుకున్నాడు. రెండుసార్లు ప్రపంచ కప్ విజేత లైగర్‌తో టగ్ ఆఫ్ వార్ ఆడుతున్నట్లు చూడొచ్చు. యువరాజ్‌తోపాటు అతని స్నేహితులు ఒక వైపు ఉండగా, మరొక వైపు లైగర్ తలపడ్డారు.

చివరికి యువరాజ్ టీం ఓడిపోయింది. అయితే సౌత్‌పా ఈ అనుభవాన్ని ఆస్వాదించినట్లు చెప్పుకొచ్చాడు. తరువాత తన మెడలో భారీ పామును ఉంచుకుని ఆశ్చర్యపరిచాడు. అలాగే ఎలుగుబంటి, కోతి, ఇతర క్రూర మృగాలకు ఆహారాన్ని అందించి సరదాగా జూలో గడిపాడు. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషపడతున్నారు.

“టైగర్ వర్సెస్ లైగర్ పోరాటం. అంతిమ ఫలితం మాకు తెలుసు. నా భయాలను ఈ జూలో చాలా వరకు పోగొట్టుకున్నాను. ఇందుకు నాకు సహకరించిన @sb_belhasa, @huzefa_aliలకు ధన్యవాదాలు ” అని యువరాజ్ క్యాప్షన్ ఇచ్చారు.

జూన్ 2019 లో అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్ అయిన యువరాజ్.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. పొట్టి ప్రపంచ కప్‌లో ఓకే ఓవర్‌లో వరుసగా 6 సిక్సులు కొట్టి గత నెలలో 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తొలి టీ20 ప్రపంచ కప్‌‌ను భారత్ అందించడంలో కీలకపాత్ర పోషించిన సౌత్‌పా.. అందరి మనసులను గెలుచుకున్నాడు. ఈ గ్లోబల్ ఈవెంట్‌లో యువరాజ్ ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌పై దాడి చేసి ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లతో రికార్డు నెలకొల్పాడు. 2011 ప్రపంచ కప్‌లోనూ దేశానికి 28 సంవత్సరాల తర్వాత టైటిల్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

Also Read: IPL 2021: ప్లేఆఫ్‌లో నంబర్ 4 ఎవరు.. రోహిత్, మోర్గాన్, శాంసన్‌లలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయో తెలుసా?

T20 World Cup: క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. దాయాదుల పోరును ప్రత్యక్షంగా చూసే ఛాన్స్.. టికెట్ల అమ్మకాలు షురూ