T20 World Cup: క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. దాయాదుల పోరును ప్రత్యక్షంగా చూసే ఛాన్స్.. టికెట్ల అమ్మకాలు షురూ

IND vs PAK: టీ20 ప్రపంచకప్‌నకు రంగం సిద్ధమవుతోంది. దుబయ్‌లో జరగనున్న ఈ పొట్టి ప్రపంచ కప్‌ కోసం అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అయితే తాజాగా ఐసీసీ ప్రేక్షకులకు ఓ గుడ్‌న్యూస్ చెప్పింది.

T20 World Cup: క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. దాయాదుల పోరును ప్రత్యక్షంగా చూసే ఛాన్స్.. టికెట్ల అమ్మకాలు షురూ
T20 World Cup 2021 Ind Vs Pak
Follow us
Venkata Chari

|

Updated on: Oct 04, 2021 | 9:58 AM

T20 World Cup, IND vs PAK: టీ20 ప్రపంచకప్‌నకు రంగం సిద్ధమవుతోంది. దుబయ్‌లో జరగనున్న ఈ పొట్టి ప్రపంచ కప్‌ కోసం అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అయితే తాజాగా ఐసీసీ ప్రేక్షకులకు ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ వార్త భారతదేశం, పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు మాత్రం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. స్టేడియంలో 70 శాతం ప్రేక్షకుల ప్రవేశానికి ఐసీసీ, టోర్నమెంట్ హోస్ట్ బిసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అంటే టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఇకపై నిశ్శబ్దంగా కాకుండా ప్రేక్షకుల సందడితో జరగనున్నాయి. యూఏఈ, ఒమన్‌లో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టిక్కెట్ల విక్రయం ప్రారంభమైంది.

ఐసీసీ నిర్వహించే ఈ మెగా ఈవెంట్‌లో సూపర్ 12 స్టేజ్ మొదటి మ్యాచ్ అక్టోబర్ 23 న జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తోన్న అద్భుతమైన మ్యాచ్ అక్టోబర్ 24 న జరుగుతుంది. ఇందులో ఇద్దరు ప్రధాన ప్రత్యర్థుల మధ్య భీకర పోరు జరగనుంది. అంటే భారత్ వర్సెస్ పాకిస్తాన్ దేశాలు ఈ ఐసీసీ ఈవెంట్‌లో తలపడతాయి.

టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం టిక్కెట్ల విక్రయం ప్రారంభమైంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. టిక్కెట్ల ప్రారంభ ధర ఒమన్‌లో 10 ఒమాని రియల్, యూఏఈలో 30 దిర్హామ్‌లుగా నిర్ణయించారు. ఐసీసీ ప్రకారం, టిక్కెట్లను www.t20worldcup.com/tickets నుంచి కొనుగోలు చేయవచ్చు.

ప్రేక్షకుల ప్రవేశంపై జైషా సంతోషం.. టీ 20 వరల్డ్ కప్ కోసం స్టేడియంలో అభిమానుల ప్రవేశానికి సంబంధించి బీసీసీఐ కార్యదర్శి జైషా మాట్లాడుతూ, “టీ 20 వరల్డ్ కప్ క్రికెట్ అభిమానుల సమక్షంలో ఆడతారని తెలియజేయడం సంతోషంగా ఉంది.స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించిన యూఏఈ, ఒమన్ ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి క్రికెట్ అభిమానులు తమ జట్టును ఉత్సాహపరిచేందుకు వస్తారని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ప్రేక్షకులతో నిండిన స్టేడియాల్లో ఆడడం వల్ల క్రికెటర్లు మెరుగ్గా రాణించేందుకు ఎంతగానో సహాయపడుతుంది.

Also Read: 35 ఏళ్ల వయస్సులో టెస్ట్ అరంగేట్రం.. తొలి మ్యాచులోనే సెంచరీతో ప్రపంచ రికార్డు.. బ్రాడ్‌మాన్ తరువాతి స్థానంలో నిలిచిన ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే?

IPL 2021, KKR vs SRH: నితీష్ రానా దెబ్బకు పగిలిన కెమెరా.. వైరలవుతోన్న వీడియో

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో