35 ఏళ్లకు టెస్టు జట్టులో అవకాశం.. తొలి మ్యాచులోనే సెంచరీతో ప్రపంచ రికార్డు.. బ్రాడ్‌మాన్ తరువాతి స్థానంలో నిలిచిన ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే?

2007లో ఆస్ట్రేలియా తరపున వన్డే, టీ20 అరంగేట్రం చేశాడు. 8 సంవత్సరాల తర్వాత టెస్ట్ జట్టులో అవకాశం పొందాడు. కానీ, ఈ బ్యాట్స్‌మెన్ కెరీర్ ఒకటిన్నర సంవత్సరాలు మాత్రమే కొనసాగింది.

35 ఏళ్లకు టెస్టు జట్టులో అవకాశం.. తొలి మ్యాచులోనే సెంచరీతో ప్రపంచ రికార్డు.. బ్రాడ్‌మాన్ తరువాతి స్థానంలో నిలిచిన ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే?
Adam Voges
Follow us
Venkata Chari

|

Updated on: Oct 04, 2021 | 10:01 AM

టెస్ట్ క్రికెట్‌ అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ సాధించడం మాములు విషయం కాదు. కానీ, ఈ అద్భుతం చాలాసార్లు జరిగింది. క్రికెట్ చరిత్రలో ఎందరో దిగ్గజాలు ఇలాంటి రికార్డును నెలకొల్పారు. అయితే అరంగేట్రంలో ఎందరో ఇలాంటి అద్భుతాలను క్రియోట్ చేయడం ఒక ఎత్తైతే.. పదవీ విరమణ వయస్సు దగ్గర పడిన ఓ బ్యాట్స్‌మెన్ టెస్టుల్లో అరంగేట్రం చేసి నేరుగా సెంచరీతో కెరీర్ ప్రారంభించడం మరో ఎత్తు. ఇలాంటి బ్యాట్స్‌మెన్‌లు చాలా తక్కువ. అలాంటి వారిలో ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ ఆడమ్ వోగ్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. కుడిచేతి వాటం కలిగిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా పేరొందిన వోగ్స్.. తన 35 వ ఏట ఆస్ట్రేలియా తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆ టెస్టులో సెంచరీతో అద్భుత అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాతో సహా ప్రపంచ క్రికెట్ చరిత్రలో కొన్ని ప్రత్యేక రికార్డులు వోగ్స్ పేరుతో లిఖించబడ్డాయి.

ఈరోజు ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ ఆడమ్ వోగ్స్ పుట్టినరోజు. వోగ్స్ 4 అక్టోబర్ 1979 న పెర్త్‌లో జన్మించారు. అయితే ఆస్ట్రేలియా జట్టులోకి రావడానికి వోగ్స్‌కి చాలా సమయం పట్టింది. వోగ్స్ ఫిబ్రవరి 2007 లో ఆస్ట్రేలియా తరపున వన్డే అరంగేట్రం చేశాడు. అదే ఏడాది డిసెంబర్‌లో అతను టీ 20 లో అరంగేట్రం చేశాడు. 8 సంవత్సరాలపాటు పరిమిత ఓవర్లలో ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ, టెస్టు జట్టులో చోటు మాత్రం దక్కించుకోలేకపోయాడు.

35 సంవత్సరాల వయస్సులో టెస్టుల్లోకి అరంగేట్రం.. 35 ఏళ్ల వయసులో టెస్టు ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అరంగేట్రంలోనే సెంచరీ సాధించాడు అయితే, వోగ్స్ టెస్టు జట్టులోకి రావడానికి చాలా కాలం వేచి ఉండాల్సి వచ్చింది. 2015 లో దేశీయ క్రికెట్‌లో నిరంతరం పరుగులు చేస్తేనే ఉన్నాడు. టెస్ట్ జట్టులో మంచి బ్యాట్స్‌మెన్ లేకపోవడం కారణంగా చివరికి వోగ్స్‌ను టెస్ట్ జట్టులోకి తీసుకున్నారు. జనవరి 2015 లో వోగ్స్ వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో అరంగేట్రం చేశాడు. ఆ సమయంలో అతని వయస్సు 35 సంవత్సరాలు. 35 ఏళ్ల పైబడిన వయసులోనూ చాలా మంది ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. కానీ వోగ్స్ తన అరంగేట్రంలోనే సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. వోగ్స్ ఈ మ్యాచ్‌లో తన తొలి ఇన్నింగ్స్‌లో 130 పరుగులు చేశాడు. దీంతో టెస్ట్ అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

ఒకటిన్నర సంవత్సరంలోనే టెస్ట్ కెరీరీ క్లోజ్.. అయితే, తరువాతి కొన్ని మ్యాచ్‌లలో వోగ్స్ రెండు అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడడంలో విఫలమయ్యాడు. నవంబర్ 2015 లో న్యూజిలాండ్‌తో జరిగిన పెర్త్ టెస్ట్‌లో 119 పరుగులు చేసి మరోసారి తన సత్తా చాటాడు. ఒక నెల తరువాత అతను హోబర్ట్ టెస్టులో వెస్టిండీస్‌పై 269 పరుగులు (నాటౌట్) చేశాడు. తర్వాత మెల్‌బోర్న్‌లో జరిగిన తదుపరి టెస్టులో 106 పరుగులు (నాటౌట్) సాధించాడు. వెల్లింగ్టన్‌లో జరిగిన తదుపరి టెస్టులో మరోసారి 239 పరుగులు చేశాడు. ఇలాంటి భారీ ఇన్నింగ్స్‌లు ఆడిన తరువాత కొన్ని టెస్ట్ మ్యాచ్‌లలో భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు. అతని టెస్ట్ కెరీర్ దాదాపు ఒకటిన్నర సంవత్సరాలలో ముగిసింది.

బ్రాడ్‌మన్ తర్వాత అత్యుత్తమ టెస్ట్ సగటు.. వోగ్స్ తన కెరీర్‌లో కేవలం 20 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయితే, ఈ సమయంలో వోగ్స్ పలు రికార్డులు సాధించాడు. వోగ్స్ 20 మ్యాచ్‌ల్లో 31 ఇన్నింగ్స్‌లలో 1485 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని కెరీర్ సగటు 61.87గా ఉంది. ఇది లెజెండరీ బ్యాట్స్‌మెన్ సర్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాత టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండవ అత్యధికంగా నమోదైంది. వోగ్స్‌కు వన్డేలు, టీ20 లలో కూడా ఎక్కువ అవకాశాలు రాలేదు. పరిమిత ఓవర్లలో వోగ్స్ రికార్డ్ బాగుంది. 31 వన్డేల్లో 1 సెంచరీతోపాటు 4 అర్ధ సెంచరీలతో సహా 45.78 సగటుతో 870 పరుగులు చేశాడు. 7 టీ 20 ల్లో 45.78 సగటుతో 139 పరుగులు చేశాడు.

Also Read: IPL 2021, KKR vs SRH: నితీష్ రానా దెబ్బకు పగిలిన కెమెరా.. వైరలవుతోన్న వీడియో

DC vs CSK, IPL 2021 Match Prediction: తొలిస్థానం కోసం దుబయ్‌లో యుద్ధం.. రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోరులో గెలిచేదెవరో?