DC vs CSK, IPL 2021 Match Prediction: తొలిస్థానం కోసం దుబయ్‌లో యుద్ధం.. రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోరులో గెలిచేదెవరో?
Today Match Prediction of Chennai Super Kings vs Delhi Capitals: చెన్నై వర్సెస్ ఢిల్లీలో ఎవరు నంబర్ వన్ అనేది నేడు దుబయ్‌లో తెలిసిపోనుంది.
ఐపీఎల్ 2021 లో భాగంగా నేడు పాయింట్ల పట్టికలోని తొలి రెండు జట్ల మధ్య పోరు జరగనుంది. అగ్రస్థానం కోసం దుబయ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ టీంల మధ్య యుద్ధం జరగనుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు ప్లేఆఫ్‌లో తమ స్థానాలను నిర్ధారించుకున్నాయి. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తొలి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ నిలచింది. ప్రస్తుతం రెండు జట్లు టోర్నమెంట్‌లో టాప్ 2 లో ఉన్నాయి. 12 మ్యాచ్‌ల తర్వాత ఇరు జట్లకు చెరో 18 పాయింట్లతో నిలిచాయి. అయితే రన్ రేట్ ఆధారంగా ధోని సేన మొదటి స్థానంలో నిలిచింది. రిషబ్ పంత్ ఢిల్లీ రెండవ స్థానంలో ఉంది. అటువంటి పరిస్థితిలో నేడు ఈ రెండు జట్లు అగ్ర స్థానం కోసం దుబయ్‌లో పోటీ పడనున్నారు. ఈ రోజుతో ఇరు జట్లలో ఎవరు నంబర్ వనే అనేది తేలనుంది.
ఎప్పుడు: ఢిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, అక్టోబర్ 4, రాత్రి 7:30 గంటలకు
ఎక్కడ: దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
మ్యాచ్ లైవ్‌ను ఎలా చూడాలి: ఐపీఎల్ అన్ని మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఇక ఓటీటీలో చూడాలని అనుకుంటే మాత్రం డిస్నీ హాట్‌స్టార్ యాప్‌లో చూడొచ్చు.
ఢిల్లీ క్యాపిటల్స్‌కు 100 వ విజయం కానుందా? ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు మ్యాచ్‌ను గెలిచి కేవలం అగ్రస్థానానికి చేరుకోవడమే కాదు, ఐపీఎల్‌లో వారికి ఇది 100 వ విజయం కూడా కానుంది. సీఎస్‌కేకి వ్యతిరేకంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఇటీవలి గణాంకాలను ఓసారి పరిశీలిస్తే.. ఈ విజయం వారికి చాలా తేలికగానే ఉండే అవకాశం ఉంది.
చెన్నై వర్సెస్ ఢిల్లీ హెడ్ టూ హెడ్ ఐపీఎల్ 2021 లో ఈరోజు ఢిల్లీ వర్సెస్ చెన్నై టీంలు రెండోసారి తలపడనున్నాయి. అంతకుముందు జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. అదే సమయంలో దుబయ్ పిచ్‌లో ఈ రెండు జట్లు తలపడటం ఇది రెండోసారి. ఇక్కడ కూడా మొదటి పోటీలో ఢిల్లీ క్యాపిటల్స్ పేరిట విజయం నమోదైంది. గత 5 మ్యాచ్‌లలో రిషబ్ పంత్ సేన 3-2 తేడాతో విజయం సాధించింది. అయితే, ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య మొత్తం 24 మ్యాచులు జరిగాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ 15 సార్లు గెలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ టీం కేవలం 9 సార్లు మాత్రమే విజయం సాధించింది.
హోరాహోరీగా పోరు రెండు జట్ల బలం విషయానికొస్తే.. కాగితంపై కనిపించినట్లే మైదానంలోనూ ఆడుతున్నాయి. రెండు జట్లు ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతూ టోర్నమెంట్‌లో దూసుకోతున్నాయి. అటువంటి పరిస్థితిలో నేటి పోటీ చాలా హోరాహోరీగా ఉండబోతుంది. IPL 2021 లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా సీఎస్‌కే నిలిచింది. ఇప్పటివరకు మొత్తం 96 సిక్సర్లు సీఎస్‌కే బ్యాట్స్‌మెన్లు కొట్టారు. ఇందులో రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడే 20 సిక్సర్లు కొట్టాడు. అదే సమయంలో, గైక్వాడ్ ఐపీఎల్ 2021 లో ఫోర్లు కొట్టడంలో కూడా ముందున్నాడు. ఇప్పటివరకు 43 ఫోర్లు కూడా బాదేశాడు. రెండు జట్ల బలం నిస్సందేహంగా ఒకటేనని ఈ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. రెండు హేమాహేమీ జట్ల మధ్య పోరు ఎంతగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మీకు తెలుసా?
– శిఖర్ ధావన్ సీఎస్‌కేకి వ్యతిరేకంగా గత రెండు సందర్భాలలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు
– దీపక్ చాహర్ 50 బంతుల్లో పృథ్వీ షాను ఐదుసార్లు ఔట్ చేశాడు
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI అంచనా: పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే, అవేశ్ ఖాన్
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI అంచనా:: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జోష్ హాజెల్‌వుడ్, సామ్ కర్రాన్, దీపక్ చాహర్