- Telugu News Photo Gallery Cricket photos IPL 2021: CSK Player Ruturaj Gaikwad on the verge of new record in DC vs CSK today match in dubai
IPL 2021: రాహుల్ రికార్డులపై కన్నేసిన చెన్నై ఓపెనర్.. నేడు ఢిల్లీతో మ్యాచులో సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడా?
రుతురాజ్ ఉన్న ఫామ్ పరంగా ధోనిసేన విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో మరో 2 రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు.
Updated on: Oct 04, 2021 | 8:04 AM

రుతురాజ్ గైక్వాడ్ ఎల్లో ఆర్మీలో కీలకమైన ప్లేయర్‌లా మారాడు. చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించి, జట్టును ప్లే ఆఫ్‌లో చేర్చాడు. ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో రితురాజ్ గైక్వాడ్ ఏకకాలంలో 2 రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. ప్రత్యేక విషయం ఏమిటంటే ఈరోజు రుతురాజ్ బ్రేక్ చేయగల ఈ రెండు రికార్డులు ఒకే బ్యాట్స్‌మెన్‌కు చెందినవి కావడం. ఆయనెవరో కాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్.

ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఆ 2 రికార్డులతో సత్తా చాటాడు. ఈ రెండు రికార్డులు ఏంటంటే.. ఐపీఎల్ 2021 లో అత్యధిక సిక్సర్లు, అత్యధిక పరుగులు. ఐపీఎల్ 2021లో అత్యధికంగా 22 సిక్సర్లు, అత్యధికంగా 528 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. ఈ రెండింటిని రాహుల్ ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో సాధించడం గమనార్హం.

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ 2021 లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా రితురాజ్ గైక్వాడ్ నిలిచాడు. అతను ఇప్పటివరకు 20 సిక్సర్లు కొట్టాడు. అదే సమయంలో 508 పరుగులు కూడా చేశాడు. అంటే, ఈ రోజు రుతురాజ్ తన ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు, 21 పరుగులు చేస్తే కేఎల్ రాహుల్ సాధించిన రెండు రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈరోజు ఐపీఎల్ 2021 లో రుతురాజ్ తన 13 వ మ్యాచ్ ఆడనున్నాడు.

అయితే కేఎల్ రాహుల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. కానీ, పంజాబ్ కింగ్స్‌కు ఇంకా 2 మ్యాచ్‌లు గ్రూప్‌స్టేజ్‌లో మిగిలి ఉన్నాయి. అంటే నేడు రుతురాజ్ రికార్డును బద్దలు కొడితే, మిగిలిన 2 మ్యాచ్‌లలో కేఎల్ రాహుల్ మరలా రుతురాజ్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. అయితే, ప్లే ఆఫ్ తరువాత రుతురాజ్ ఇంకొన్ని మ్యాచులు ఆడనుండడంతో.. ఆయనే ఈ రికార్డుల్లో విజేతగా నిలచే అవకాశం ఉంది.

ఐపీఎల్ 2021 లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఈ సీజన్‌లో 100 సిక్సర్‌లకు కేవలం 4 అడుగుల దూరంలో నిలిచింది. అంటే ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ టీం 96 సిక్సర్లు బాదేసింది. ఇందులో రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడే 20 సిక్సర్లు సాధించాడు. ఫాఫ్ డు ప్లెసిస్ 18 సిక్సర్లతో జట్టులో రెండో స్థానంలో ఉన్నాడు.





























