AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16 ఏళ్ల బ్యాట్స్‌మెన్.. అరంగేట్రంలోనే వేగవంతమైన సెంచరీతో రికార్డు.. 37 బంతుల్లోనే బాదేసిన ఆ ప్లేయర్ ఎవరంటే?

ఏప్రిల్‌లో నమోదు చేసిన ఈ ప్రపంచ రికార్డు అక్టోబర్‌లో చెరిగిపోయింది. ఈ 16 ఏళ్ల బ్యాట్స్‌మెన్ ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై దాడి చేశాడు.

16 ఏళ్ల బ్యాట్స్‌మెన్.. అరంగేట్రంలోనే వేగవంతమైన సెంచరీతో రికార్డు.. 37 బంతుల్లోనే బాదేసిన ఆ ప్లేయర్ ఎవరంటే?
Shahid Afridi
Venkata Chari
|

Updated on: Oct 04, 2021 | 7:20 AM

Share

వయస్సు కేవలం 16 సంవత్సరాలే. కానీ, అంతర్జాతీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డును నెలకొల్పి ఔరా అనిపించాడు. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ తన తొలి వన్డేలో అత్యంత వేగంగా సెంచరీ చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఏప్రిల్‌లో నమోదు చేసిన ఈ ప్రపంచ రికార్డు అక్టోబర్‌లో చెరిగిపోయింది. అలాంటి వేగవంతమైన వన్డే సెంచరీకి నేటితో సరిగ్గా 25 ఏళ్లు పూర్తయ్యాయి. 1996 సంవత్సరంలో అక్టోబర్ 4 న ఈ రికార్డు క్రియోట్ అయింది. పాకిస్తాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది తన 16 వ ఏట అరంగేట్రం చేసిన తొలి వన్డేలోనే సెంచరీ సాధించాడు. ఆ తర్వాత 17 సంవత్సరాల వరకు ఈ రికార్డు అలానే ఉండిపోయింది.

1996 లో 16 ఏళ్ల షాహిద్ అఫ్రిది నైరోబిలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచుతో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను అంతర్జాతీయ పిచ్‌లో వేగవంతమైన వన్డే సెంచరీ కోసం కొత్త రికార్డును సృష్టించాడు. దీంతో శ్రీలంక జట్టుపై పగను కూడా పాకిస్థాన్ తీర్చేలా చేశాడు. అంతకు 6 నెలల ముందు శ్రీలంక బ్యాట్స్‌మెన్ సనత్ జయసూర్య పాకిస్తాన్‌పై అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. జయసూర్య రికార్డును అఫ్రిది బద్దలు కొట్టాడు.

ఏప్రిల్‌లో నెలకొల్పిన ప్రపంచ రికార్డు అక్టోబర్‌లో.. 2 ఏప్రిల్ 1996 న సింగపూర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జయసూర్య 65 బంతుల్లో 134 పరుగులు చేశాడు. ఇందులో అతను కేవలం 48 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ సమయంలో అతను 11 ఫోర్లు, 11 సిక్సర్లు కొట్టాడు. పాకిస్తాన్ బౌలర్లపై విరుచపడిన జయసూర్య.. ఈ ప్రపంచ రికార్డును సృష్టించాడు. 6 నెలల తరువాత షాహిద్ అఫ్రిది శ్రీలంక బౌలర్లపై భీభత్సం చేసి జయసూర్య రికార్డును బద్దలు కొట్టాడు. 1996 అక్టోబర్ 4 న తన తొలి అరంగేట్రం చేసిన అఫ్రిది.. శ్రీలంకపై 40 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఇందులో అతను కేవలం 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఆఫ్రిది పేలుడు ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. అతను కేవలం 17 బంతుల్లో బౌండరీల సహాయంతోనే తన ఇన్నింగ్స్‌లో 90 పరుగులు పూర్తిచేశాడు.

అఫ్రిది ప్రపంచ రికార్డు 17 ఏళ్లకు బద్దలు.. పాకిస్తాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిది చేసిన వేగవంతమైన వన్డే సెంచరీ రికార్డు 17 సంవత్సరాలుగా ప్రపంచ క్రికెట్‌లో చెక్కుచెదరకుండా ఉంది. 2014 లో న్యూ ఇయర్ రోజున న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కోరీ ఆండర్సన్ ఈ రికార్డును మరోసారి బద్దలు కొట్టాడు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో ఆండర్సన్ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఏదాడి తరువాత అండర్సన్ రికార్డు కూడా బద్దలైంది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ తన పేరుతో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. జొహన్నెస్‌బర్గ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేల్లో కేవలం 31 బంతుల్లో వేగవంతమైన సెంచరీ సాధించిన ఏబీ సరికొత్త కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు.

Also Read: IPL 2021: జట్టు మాత్రం ఫ్లాప్.. వన్ మ్యాన్ షోతో ఆకట్టుకున్న పంజాబ్ కెప్టెన్.. తొలి భారతీయుడిగా అరుదైన రికార్డు.. అదేంటంటే?

IPL 2021 Point Table: ప్లేఆఫ్‌లోకి ఎంటరైన మూడో జట్టు.. పాయింట్ల పట్టికలో ఎవరు ముందున్నారు.. టాప్‌ 4లో ఏయే టీంలు ఉన్నాయంటే?