IPL 2021 Point Table: ప్లేఆఫ్‌లోకి ఎంటరైన మూడో జట్టు.. పాయింట్ల పట్టికలో ఎవరు ముందున్నారు.. టాప్‌ 4లో ఏయే టీంలు ఉన్నాయంటే?

చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత ప్లేఆఫ్‌కు చేరుకున్న మూడో జట్టుగా విరాట్ కెప్టెన్సీ నిలిచింది. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు జట్లు మాత్రమే ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తాయి.

IPL 2021 Point Table: ప్లేఆఫ్‌లోకి ఎంటరైన మూడో జట్టు.. పాయింట్ల పట్టికలో ఎవరు ముందున్నారు.. టాప్‌ 4లో ఏయే టీంలు ఉన్నాయంటే?
Ipl 2021 Point Table (1)
Follow us
Venkata Chari

|

Updated on: Oct 04, 2021 | 6:29 AM

IPL 2021 Point Table: ఈ రోజు IPL 2021 లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. టాప్ 2 జట్ల మధ్య నేడు హోరాహోరీ పోరు జరగనుంది. అయితే ఇప్పటికే ఈ రెండు జట్లు ప్లే ఆఫ్‌కు చేరుకున్నాయి. అయితే సూపర్ సండే తరువాత ఐపీఎల్ 2021 ప్లేఆఫ్‌లోకి మూడవ జట్టు ఎంటరైంది. నిన్న జరిగిన డబుల్ హెడర్స్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ని ఓడించి ప్లేఆఫ్ టికెట్‌ను పొందింది. అంతకు ముందు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి. అదే సమయంలో రెండో మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడ్డాయి. ఇందులో కోల్‌కతా గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది. అయితే రెండు మ్యాచ్‌ల తర్వాత పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పు లేదు. బెంగళూరు మూడో స్థానంలో ఉండగా కోల్‌కతా నాల్గవ స్థానంలో నిలిచింది. పంజాబ్ జట్టు ఐదవ స్థానంలో ఉండగా హైదరాబాద్ జట్టు ఎనిమిదవ స్థానంలో ఉంది.

ఐపీఎల్ ప్రతి సీజన్‌లో పాయింట్ టేబుల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఏ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందో, పాయింట్ల పట్టికలోని లెక్కల ఆధారంగా తెలిసిపోతుంది. రన్ రేట్, గెలుపు, ఓటమిల తర్వాత పాయింట్ల పట్టికలో ఆయా జట్ల జాతకాలు మారుతుంటాయి. అయితే పాయింట్ల పట్టికలోని మొదటి నాలుగు జట్లు మాత్రమే ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తాయి.

ఫైనల్స్‌కు చేరే జట్లు మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య క్వాలిఫయర్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లో తన స్థానాన్ని నిర్ధారిస్తుంది. అదే సమయంలో, ఓడిపోయిన జట్టు ఫైనల్ చేరుకోవడానికి మరొక అవకాశం లభిస్తుంది. మూడవ మరియు నాల్గవ స్థానంలో ఉన్న జట్లు మ్యాచ్ విజేతను ఎదుర్కొన్నప్పుడు.

పాయింట్ల పట్టిక.. చెన్నై సూపర్ కింగ్స్ – 12 మ్యాచ్‌లు, 9 విజయాలు, 3 పరాజయాలు, 18 పాయింట్లు ఢిల్లీ క్యాపిటల్స్ – 12 మ్యాచ్‌లు, 9 విజయాలు, 3 పరాజయాలు, 18 పాయింట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 12 మ్యాచ్‌లు, 8 విజయాలు, 4 పరాజయాలు, 16 పాయింట్లు కోల్‌కతా నైట్ రైడర్స్ – 13 మ్యాచ్‌లు , 6 విజయాలు, 7 పరాజయాలు, 12 పాయింట్లు పంజాబ్ కింగ్స్ – 13 మ్యాచ్‌లు, 5 విజయాలు, 8 ఓటములు, 10 పాయింట్లు రాజస్థాన్ రాయల్స్ – 12 మ్యాచ్‌లు, 5 విజయాలు, 7 ఓటములు, 10 పాయింట్లు ముంబై ఇండియన్స్ – 12 మ్యాచ్‌లు, 5 విజయాలు, 7 ఓటములు, 10 పాయింట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ – 12 మ్యాచ్‌లు, 2 విజయాలు, 10 ఓటములు, 4 పాయింట్లు

Also Read: IPL 2021, KKR vs SRH Match Result: 6 వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం.. అర్థ శతకంతో ఆకట్టుకున్న శుభ్మన్ గిల్

KKR vs SRH, IPL 2021: కోల్‌కతా టార్గెట్ 116.. కేకేఆర్ బౌలర్ల విజృంభన.. అత్యల్ప స్కోర్‌కే హైదరాబాద్ ఢమాల్

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!