Cyber Crime: మళ్లీ రెచ్చిపోయిన మాయగాళ్లు.. సోషల్ మీడియా వేదికగా వృద్ధురాలిని నిలువు దోపిడీ చేశారు..!

Cyber Crime: ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇంటర్నెట్ సామ్రాజ్యంలో.. అమాయుకులే లక్ష్యంగా చేసుకుని

Cyber Crime: మళ్లీ రెచ్చిపోయిన మాయగాళ్లు.. సోషల్ మీడియా వేదికగా వృద్ధురాలిని నిలువు దోపిడీ చేశారు..!
Cyber Crime
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 05, 2021 | 8:48 AM

Cyber Crime: ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇంటర్నెట్ సామ్రాజ్యంలో.. అమాయుకులే లక్ష్యంగా చేసుకుని గాలం విసురుతున్నారు మాయగాళ్లు. ఇటీవలి కాలంలో పాత కరెన్సీ నోట్లు, నాణెలు ఉంటే లక్షలు సొంతం చేసుకోవచ్చంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, దాన్ని అవకాశంగా మలుచుకున్న దోపిడీదారులు.. ఓ వృద్దురాలి నుంచి రూ. 11 లక్షలు కాజేశారు. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వృద్ధురాలి వద్ద 5, 10 పాత నాణేలు, కరెన్సీ నోట్లు ఉన్నాయి. వాటిని మార్చి ఇస్తామంటూ కేటుగాళ్లు.. సోషల్ మీడియా ద్వారా వృద్ధురాలిని సంప్రదించారు.

అయితే, రూ. 45 లక్షల విలువ చేసే కరెన్సీ నోట్లను మార్చాలంటే కొంత ఖర్చు అవుతుందని, అలాగే జీఎస్‌టీ కూడా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి అంగీకరించిన వృద్ధురాలు.. చీటర్స్ చెప్పినట్లుగా రూ. 11.45 లక్షలు వారి బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేసింది. కొంతసేపటి తరువాత ఆ వృద్ధురాలు.. వారిని సంప్రదించే ప్రయత్నం చేయగా.. ఎలాంటి రెస్పాండ్స్ రాలేదు. దాంతో తాను మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు.. పోలీసులను ఆశ్రయించింది. పోలీసులకు జరిగిన విషయాన్ని చెప్పి.. ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల అకౌంట్ వివరాలు, సోషల్ మీడియా వేదికగా వారు జరిపిన సంప్రదింపుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Also read:

వైరల్‌గా ఫుడ్‌ ఛాలెంజ్‌.. 20 నిమిషాల్లో లాగించండి 20 వేలు గెలవండి! వీడియో

Viral Video: అతి పొడవైన చెవులతో గిన్నిస్ రికార్డు కొట్టింది.. వీడియో

Petrol Diesel Price: రోజు రోజుకు మారుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో ఎలా ఉందంటే..

బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?