అమెరికా కోర్ట్ సంచలన తీర్పు.. హంతకుడికి 5 యావజ్జీవ శిక్షలు.. వీడియో
ఎంతో కరడుగట్టిన నేరస్తులకు మాత్రమే యావజ్జీవ శిక్ష పడటం చూస్తాం. అలాంటిది అమెరికాలో ఓ హంతకుడికి ఐదుసార్లు యావజ్జీవ శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. ఈ తీర్పు తాజాగా సంచలనంగా మారింది.
ఎంతో కరడుగట్టిన నేరస్తులకు మాత్రమే యావజ్జీవ శిక్ష పడటం చూస్తాం. అలాంటిది అమెరికాలో ఓ హంతకుడికి ఐదుసార్లు యావజ్జీవ శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. ఈ తీర్పు తాజాగా సంచలనంగా మారింది. మూడేళ్ల క్రితం ఓ పత్రిక కార్యాలయంపై దాడిచేసి అయిదుగురు పాత్రికేయులను దారుణంగా కాల్చిచంపిన హంతకుడి కేసులో అమెరికా కోర్టు చరిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. జీవిత కాలంలో ఎట్టిపరిస్థితుల్లోనూ హంతకుడు జార్రోడ్ రామోస్ జైలు నుంచి విడుదల కాకుండా కఠిన శిక్షలు విధించింది. అయిదు యావజ్జీవ శిక్షలతో పాటు మరో 345 ఏళ్లు కారాగారంలోనే ఉంచాలని ఆదేశించింది. స్వల్ప కాలం జైలు బయటకు అనుమతించే పెరోల్ వంటి సదుపాయాన్ని కూడా హంతకుడికి కల్పించవద్దని స్పష్టం చేస్తూ అన్నె అరండెల్ కౌంటీ జడ్జి మైఖేల్ వాష్ తీర్పునిచ్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి: కత్రినా కైఫ్ కు సేమ్ టూ సేమ్ జిరాక్స్ కాపీ.. అసలు కత్రినా ఎవరో గుర్తుపట్టడం కష్టమే..! వీడియో
Big News Big Debate: ప్రకాష్ రాజ్ vs మంచు విష్ణు గొడవలతో టాలీవుడ్ రోడ్డున పడిందా..?(లైవ్ వీడియో)