TSPSC: పేపర్ లీక్స్‌లో సిట్ సంచలన నిర్ణయం.. విచారణకు రావాలంటూ వారికి నోటీసులు..
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ వ్యవహారంలో దూకుడు పెంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. అనువణువూ ఆరా తీస్తోంది. టీఎస్‌పీఎస్‌సీలో కీలక వ్యక్తులనూ విచారించేందుకు సిద్ధమైంది సిట్. చైర్మన్, సెక్రటరీ సహా బోర్డు సభ్యులందరికీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు, ఈ కేసును దర్యాప్తు చేయాలంటూ ఈడీకీ కంప్లయింట్ చేసింది కాంగ్రెస్.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ వ్యవహారంలో దూకుడు పెంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. అనువణువూ ఆరా తీస్తోంది. టీఎస్‌పీఎస్‌సీలో కీలక వ్యక్తులనూ విచారించేందుకు సిద్ధమైంది సిట్. చైర్మన్, సెక్రటరీ సహా బోర్డు సభ్యులందరికీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు, ఈ కేసును దర్యాప్తు చేయాలంటూ ఈడీకీ కంప్లయింట్ చేసింది కాంగ్రెస్.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్స్ ఇష్యూ కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సెక్రటరీలు సహా బోర్డు మెంబర్లకు నోటీసులు జారీచేసింది సిట్. టీఎస్‌పీఎస్‌సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌కు నోటీసులు ఇచ్చిన దర్యాప్తు బృందం.. రేపు విచారణకు రావాలని ఆదేశించింది. బోర్డు సభ్యుడు లింగారెడ్డికి సైతం నోటీసులు ఇచ్చిన సిట్… విచారణకు రావాలని స్పష్టం చేసింది.ఈ వ్యవహారంలో… చైర్మన్ జనార్ధన్‌రెడ్డిని కూడా విచారించనుంది ఇన్వెస్టిగేషన్ టీం.
ప్రధాననిందితుల్లో ఒకడైన ఏవన్ ప్రవీణ్ ప్రస్తుతం సెక్రటరీ అనితా రామచంద్రన్ పీఏగా వ్యవహరిస్తుండగా… రమేశ్, టీఎస్‌పీస్సీ మెంబర్ లింగారెడ్డికి పీఏగా ఉన్నాడు. ప్రవీణ్, రమేష్‌లను ఇప్పటికే అరెస్ట్ చేసిన సిట్.. మరో నిందితుడు షమీమ్‌తో కలిపి మూడురోజులుగా విచారిస్తోంది. మూడోరోజు కస్టడీ ముగిసిన ఈ ముగ్గురు నిందితులను… కింగ్ కోఠి ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించారు అధికారులు. అనంతరం సిట్ కార్యాలయానికి తరలించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్‌లో పొలిటికల్ పొగలూ తగ‌్గడం లేదు. ఈ వ్యవహారంపై ఈడీకి కంప్లయింట్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇదే అంశంపై పార్టీనేతలతో కలిసి ఈడీ ఆఫీసుకు వెళ్లారు రేవంత్. ఇప్పటి వరకు సిట్ అధికారులు సీజ్ చేసిన వాటన్నింటిని ఈడీ స్వాధీనం చేసుకోవాలని.. ఈ కేసులో కేటీఆర్‌ను విచారించాలని కోరారు.
టీఎస్‌పీఎస్సీ తాజా నిర్ణయంతో.. పేపర్ లీక్ ఇష్యూ ఇంకెలాంటి మలుపు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ ఏర్పడింది. ఇప్పటికే రోజుకో కొత్తవిషయం వెలుగుచూస్తున్న వేళ.. రేపటి బోర్డు ముఖ్యుల విచారణ తర్వాత మరిన్ని కీలక విషయాలు బయటికొచ్చే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..