AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG 2026 Notification: నీట్‌ యూజీ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే?

ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) యూజీ (NEET UG 2026) పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)..

NEET UG 2026 Notification: నీట్‌ యూజీ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే?
NEET UG 2026 Notification Out
Srilakshmi C
|

Updated on: Feb 09, 2026 | 7:00 AM

Share

దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) యూజీ (NEET UG 2026) పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ఆదివారం ప్రకటన వెలువరించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు కూడా ఫిబ్రవరి 8 నుంచే ప్రారంభమైనాయి. తెలుగు, ఇంగ్లిష్‌, హిందీతో పాటు మొత్తం 13 భాషల్లో మే 3వ తేదీన దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించనుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీతో సైన్స్‌లో గ్రూప్‌లో ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత పొందిన వారు నీట్‌ యూజీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే విద్యార్ధుల వయసు 17 ఏళ్లు ఏనిండి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 8, 2026వ తేదీ రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈసారి దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్‌ ఈ-కేవైసీ తప్పనిసరి చేసింది. అలాగే లైవ్‌ఫొటో క్యాప్చర్ కూడా ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తద్వారా సిస్టమ్‌ మీ లైవ్‌ ఫొటోని ఆటోమేటిక్‌గా ఆధార్‌తో సరిపోల్చుతుంది. ఒకవేళ లైవ్‌ ఫొటో ఆధార్‌తో సరిపోలకపోతే.. తగిన ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దీనితోపాటు అభ్యర్థుల ప్రస్తుత లేదా శాశ్వత అడ్రస్‌ ఆధారంగానే పరీక్ష కేంద్రాలను సైతం కేటాయించనున్నారు.

దరఖాస్తు సమయంలో జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.1700 జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులు రూ.1600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్‌ జెండర్‌ అభ్యర్థులు రూ.1000 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌, సిటీ ఇంటిమేషన్‌ ప్లిప్‌లకు సంబంధించిన సమాచారాన్ని తర్వాత వెల్లడించనున్నారు. నీట్ పరీక్ష మే 3న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒకే షిఫ్ట్‌లో దేశ వ్యాప్తంగా జరగనుంది. ఇతర సందేహాలకు 011-40759000, 011-69227700 ఫోన్ నంబర్లు లేదా neetug2026@nta.ac.in ఈ-మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చని ఎన్‌టీఏ సూచించింది.

ఇవి కూడా చదవండి

నీట్‌ (యూజీ)-2026 నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

నీట్‌ యూజీ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే?
నీట్‌ యూజీ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే?
నో-కాస్ట్ EMI వెనుక ఉన్న రహస్యం ఏమిటి? నిజంగా ఏ ఛార్జీలు ఉండవా?
నో-కాస్ట్ EMI వెనుక ఉన్న రహస్యం ఏమిటి? నిజంగా ఏ ఛార్జీలు ఉండవా?
టీమిండియా సంచలన నిర్ణయం..వరల్డ్ కప్ మధ్యలో ప్రాక్టీస్‎కు బ్రేక్
టీమిండియా సంచలన నిర్ణయం..వరల్డ్ కప్ మధ్యలో ప్రాక్టీస్‎కు బ్రేక్
తదుపరి మ్యాచ్‌కు ముందే రీఎంట్రీ ఇవ్వనున్న ఆల్ రౌండర్.. ఎవరంటే?
తదుపరి మ్యాచ్‌కు ముందే రీఎంట్రీ ఇవ్వనున్న ఆల్ రౌండర్.. ఎవరంటే?
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?