ప్రశాంతంగా ఉంటూ ప్రపంచాన్నే జయించాలా.. చాణక్యుడి అద్భుతమైన చిట్కాలివే!  

Samatha

9  February 2026

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన తన జ్ఞానంలో అత్యంత జ్ఞానవంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతుల సంపాదించుకున్నాడు.

ఆ చార్య చాణక్యుడు

చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగ పడే ఎన్నో అంశాల గురించి గొప్పగా తెలియజేయడం జరిగింది.

చాణక్య నీతి

అదే విధంగా ఆయన విజయం శబ్ధం చేయడం ద్వారా కాదు, ప్రశాంతంగా ఉంటూనే ఎలా సక్సెస్ అవ్వాలి అనే విషయాల గురించి చాలా గొప్పగా తెలియజేశాడు.

విజయం

కాగా, చాణక్యుడి ప్రకారం, మీ శత్రువులను ఓడించి, మీ విజయం సాధించడానికి మీకు ఉపయోగపడే శక్తివంతమైన రహస్యాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రువులు

ఏ వ్యక్తి అయితే తక్కువ మాట్లాడుతూ, నాలకును అదుపులో ఉంచుకుంటాడో, అతను అన్ని ప్రమాదాల నుంచి బయటపడటమే కాకుండా, తన రహస్యాలు కూడా బహిర్గతం కావు, అతను సక్సెస్ అవుతాడు.

తక్కువ మాట్లాడటం

చాణక్య నీతి ప్రకారం, మూర్ఖులతో వాదన ఎప్పుడూ మంచిది కాదు, తెలివైన వ్యక్తి మూర్ఖులతో వాదించకుండా ప్రశాంతంగా వెళ్లిపోతాడు.

మూర్ఖులతో వాదన

ఏదైనా లక్ష్యం సాధించాలి అంటే వివేకం చాలా అవసరం, అందువలన మీ  ప్రణాళికలు మీరు రహస్యంగా ఉంచినప్పుడే మీరు సక్సెస్ అవుతారు.

ప్రణాళికలు రహస్యం

చాణక్యుడి ప్రకారం ఎవరు అయితే  తాను సాధించేదాని గురించి నిశ్శబ్దంగా ఉంటూ తన పని తాను చేసుకుంటాడో, అతని విజయం చాలా శబ్ధం చేస్తుందంట.

నిశ్శబ్ధమే విజయం