AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tanvi Gadkari : ఎవరీ తన్వీ గడ్కరీ? వాంఖడే స్టేడియంలో డ్యాన్స్‌తో నెటిజన్లను ఫిదా చేసిన వైరల్ బ్యూటీ

Tanvi Gadkari : ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, అమెరికా మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే మైదానంలో ఆట కంటే కూడా గ్యాలరీలో జరిగిన కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Tanvi Gadkari : ఎవరీ తన్వీ గడ్కరీ? వాంఖడే స్టేడియంలో డ్యాన్స్‌తో నెటిజన్లను ఫిదా చేసిన వైరల్ బ్యూటీ
Tanvi Gadkari
Rakesh
|

Updated on: Feb 09, 2026 | 9:13 AM

Share

Tanvi Gadkari : ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, అమెరికా మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే మైదానంలో ఆట కంటే కూడా గ్యాలరీలో జరిగిన కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, టీమ్ ఇండియా జెర్సీ ధరించి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కెమెరా కంటికి చిక్కిన ఒక యువతి ఇప్పుడు నెటిజన్ల హాట్ టాపిక్‌గా మారింది. ఆమె మరెవరో కాదు, ముంబైకి చెందిన నటి, డ్యాన్సర్ తన్వీ గడ్కరీ. ఫిబ్రవరి 7, శనివారం నాడు వాంఖడే స్టేడియంలో భారత్ మరియు అమెరికా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ట్రేడ్‌మార్క్ సుప్లా షాట్ కొట్టిన సమయంలో కెమెరా స్టేడియంలోని అభిమానుల వైపు మళ్లింది. అప్పుడు టీమిండియా జెర్సీలో ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించిన తన్వీ గడ్కరీ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇదే వీడియోలో మరోవైపు ముకేశ్ అంబానీ రోహిత్ శర్మకు టీ ఆఫర్ చేయడం, రోహిత్ దానిని సున్నితంగా తిరస్కరించడం కూడా కనిపించింది.

ఎవరీ తన్వీ గడ్కరీ?

తన్వీ గడ్కరీ ముంబైకి చెందిన నటి, ప్రొఫెషనల్ డ్యాన్సర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్. ఆమె కేసీ లా కాలేజీలో చదువుకున్నప్పటికీ, తనకున్న ఆసక్తితో నటన, డ్యాన్స్ రంగంలోకి అడుగుపెట్టారు. అమెజాన్ మినీ టీవీలో ప్రసారమైన క్యాంపస్ బీట్స్ అనే డ్యాన్స్ వెబ్ సిరీస్‌లో రిహానా పాత్రతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జమ్నాపాల్, పవర్ ఆఫ్ పాంచ్ వంటి షోలలో కూడా నటించారు. బన్సీ, దిల్ డుబ్దా జావే వంటి మ్యూజిక్ వీడియోలలో కూడా తన్వీ తన డ్యాన్స్ ప్రతిభను చాటుకున్నారు.

సోషల్ మీడియా స్టార్‌గా తన్వీ

తన్వీ గడ్కరీకి ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 3.1 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె నిత్యం తన డ్యాన్స్ రీల్స్, లైఫ్ స్టైల్ వీడియోలు మరియు బ్రాండ్ కొల్లాబరేషన్లను అభిమానులతో పంచుకుంటారు. తన మొదటి క్రికెట్ మ్యాచ్‌ను స్టేడియంలో వీక్షించడం గురించి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. “నా మొదటి లైవ్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లాను. టీవీలో డ్యాన్స్ చేస్తూ కనిపించాను” అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వైరల్ వీడియోతో ఆమె ఫాలోయింగ్ మరింత పెరుగుతోంది.

మ్యాచ్ హైలైట్స్

ఈ ఉత్కంఠభరిత పోరులో భారత్ 29 పరుగుల తేడాతో అమెరికాను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ మ్యాచ్‌ను వీక్షించారు. టోర్నమెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రోహిత్ శర్మ కూడా వారితో కలిసి కాసేపు మ్యాచ్ ఎంజాయ్ చేయడం విశేషం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..